Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో ఆరు జిల్లాలకు పిడుగు హెచ్చరిక

ఏపీలో ఆరు జిల్లాలకు పిడుగు హెచ్చరిక
, గురువారం, 22 ఏప్రియల్ 2021 (10:26 IST)
ఏపీలోని ప్రకాశం,గుంటూరు, విశాఖ, విజయనగరం, కర్నూలు, అనంతపురం జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ  హెచ్చరికలు జారీ చేసింది.

ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం, పెద్దరావీడు, త్రిపురాంతకము, దొనకొండ, మార్కాపురం, దోర్నాల, అర్ధవీడు, రాచేర్ల, పుల్లలచెరువు, కురిచేడు, కనిగిరిలో గుంటూరు జిల్లా నూజెండ్ల, వినుకొండ, వెల్దుర్తి, మాచెర్ల, రాజుపాలెంలో పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.

విశాఖ జిల్లా జీకె వీధి, చింతపల్లి, జి.మాడుగుల, కొయ్యూరు, విజయనగరం జిల్లా సాలూరు, మక్కువ కర్నూలు జిల్లా డోన్, పత్తికొండ, మద్దికేర తూర్పు, వెల్దుర్తి, అనంతపురం ఉరవకొండ, గుంతకల్లు, తలుపుల, పుట్టపర్తి, ఓబులదేవరచెరువు మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉందని వెల్లడించింది.

పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని హెచ్చిరించింది. ప్రజలంతా సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్  కె.కన్నబాబు సూచించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో తేలికపాటి వర్షాలు