Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

1వ తేదీ నుంచి ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో ఎస్ఈసీ ప‌ర్య‌ట‌న‌

Advertiesment
1వ తేదీ నుంచి ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో ఎస్ఈసీ ప‌ర్య‌ట‌న‌
, శనివారం, 30 జనవరి 2021 (11:24 IST)
పంచాయతీ ఎన్నికలపై జిల్లాల వారీగా అధికారులతో సమీక్షలో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ త్వరలో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు.

శుక్ర‌, శ‌నివారాల్లో రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తున్న ఆయన.. ఫిబ్రవరి 1, 2 తేదీల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలకు వెళ్లనున్నారు.

1వ తేదీ మధ్యాహ్నం 12.20 గంటలకు విజయవాడ నుంచి బయల్దేరనున్న ఎస్‌ఈసీ.. మధ్యాహ్నం 1.30గంటలకు విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి 2.30 గంటలకు శ్రీకాకుళం బయల్దేరి వెళ్తారు. సాయంత్రం 4.30 గంటల నుంచి అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి విజయనగరం వెళ్లనున్నారు.

సాయంత్రం 7 గంటల నుంచి అక్కడి అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత విశాఖ వెళ్లి అక్కడే రాత్రి బస చేస్తారు. 2వ తేదీ ఉదయం 9 గంటలకు విశాఖ జిల్లా అధికారులతో, మధ్యాహ్నం 1.30 గంటలకు కాకినాడ వెళ్లి తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగంతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.

అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడ నుంచి బయల్దేరి ఏలూరు చేరుకుంటారు. అక్కడ రాత్రి 7 గంటల నుంచి పశ్చిమ గోదావరి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెండింగ్‌లో ఉన్న అర్జీల‌ విడుద‌ల‌కు చ‌ర్య‌లు చేప‌ట్టాలి: విజ‌య‌వాడ‌‌ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్