Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో 12 మంది

ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో 12 మంది
, బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (09:10 IST)
ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి రెండు జిల్లాల నుంచి మొత్తం 12 మంది నామినేషన్లు దాఖలు చేశారు.

మంగళవారం రాజమహేంద్రవరానికి చెందిన యడవిల్లి రామకృష్ణప్రసాద్‌, రాజోలుకు చెందిన బడుగు సాయిబాబా, తాడేపల్లిగూడేనికి చెందిన మోదుగుల బాలనాగేశ్వరరావు, ఉండ్రాజవరానికి చెందిన టి.రవి, కాకినాడ సాంబమూర్తినగర్‌కు చెందిన పెన్మెత్స వి కృష్ణ నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడిగా ఎస్సీ  కార్పొరేషన్‌ ఎండీ శామ్యుల్‌ ఆనంద్‌కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించింది. మంగళవారం మధ్యాహ్నం ఆయన కాకినాడ వచ్చి కలెక్టర్‌ మురళీధర్‌  రెడ్డిని కలిశారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై చర్చించారు. 

కృష్ణా - గుంటూరు జిల్లా ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గానికి 24 నామినేషన్లు దాఖలయ్యాయి. కృష్ణా - గుంటూరు జిల్లా ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గానికి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. చివరి రోజైన మంగళవారం 11 మంది అభ్యర్థులు తమ అనుచరులతో ర్యాలీగా గుంటూరు కలెక్టరేట్‌ వద్దకు వచ్చి రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలను సమర్పించారు.

కొందరు అభ్యర్థులు ముందుజాగ్రత్తగా రెండు, మూడు సెట్లు వేయడంతో మొత్తం నామినేషన్లు దాఖలైనట్లు అయింది. నామినేషన్ల దాఖలు గడువు ముగిసిన దృష్ట్యా ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం బుధవారం గుంటూరు కలెక్టరేట్‌లోని రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన జరుగుతుంది.

ఉదయం 11 గంటల నుంచి రిటర్నింగ్‌ అధికారి వివేక్‌యాదవ్‌ సమక్షంలో ఈ ప్రక్రియ ప్రారంభమౌతుంది. అభ్యర్థులు/వారి ప్రతినిధులు నామినేషన్ల పరిశీలనకు హాజరు కావొచ్చని అధికారవర్గాలు తెలిపాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియుడి మోజులో పడి మహిళ ఏం చేసిందో చూడండి