Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓఎంసీ కేసులో ఐఏఎస్‌ శ్రీలక్ష్మికి చివరి అవకాశం: సీబీఐ కోర్టు

Webdunia
మంగళవారం, 22 జూన్ 2021 (11:44 IST)
ఓబుళాపురం మైనింగ్‌ కేసులో నిందితురాలైన ఏపీ ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్‌లో వాదనలు వినిపించడానికి చివరిగా ఓ అవకాశం ఇస్తున్నట్లు సీబీఐ కోర్టు తెలిపింది. ఈ నెల 29న వాదనలు వినిపించని పక్షంలో ఏకపక్షంగా విచారణ చేపట్టి ఉత్తర్వులు వెలువరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

ఓబుళాపురం గనుల అక్రమ మైనింగ్‌ వ్యవహారంపై సీబీఐ దాఖలు చేసిన కేసులో సోమవారం సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి బి.ఆర్‌.మధుసూదన్‌రావు విచారణ చేపట్టారు. కేసును కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్‌ వేసినట్లు ఈ కేసులో 6వ నిందితురాలైన ఐఏఎస్‌ వై.శ్రీలక్ష్మి తరఫు న్యాయవాది తెలిపారు.

గత ఏడాది తాము పిటిషన్‌ దాఖలు చేయగా సీబీఐ కౌంటరు కూడా వేసిందని.. ఈ నెల 25న అది విచారణకు రానుందని చెప్పారు. వాదనలను విన్న న్యాయమూర్తి ఈ కేసు విచారణను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులేవీ ఇవ్వలేదన్నారు. అందువల్ల వచ్చే విచారణ నాటికి వాదనలు వినిపించాల్సిందేనంటూ ఈ నెల 29కి వాయిదా వేశారు.

కొన్ని పత్రాలు అందించాలంటూ గాలి జనార్దన్‌రెడ్డి, గనుల శాఖ మాజీ డైరెక్టర్‌ వి.డి.రాజగోపాల్‌, మాజీ ఐఏఎస్‌ కృపానందంలు దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్లపై విచారణనూ అదే తేదీకి వాయిదా వేశారు.
 
హెటిరో, పెన్నా కేసులు వాయిదా
జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో భాగంగా నమోదైన అరబిందో, హెటిరో, పెన్నా సిమెంట్స్‌ కేసులూ వాయిదా పడ్డాయి. అరబిందో, హెటిరో వ్యవహారంలో నిందితులైన హెటిరో కంపెనీతోపాటు ఎండీ శ్రీనివాసరెడ్డి తమపై కేసు కొట్టివేయాలని  వ్యాజ్యాలు దాఖలు చేశారు.

వీటిలో విచారణను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. కొవిడ్‌ నేపథ్యంలో అన్ని మధ్యంతర ఉత్తర్వులను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ హైకోర్టు ఫుల్‌ బెంచ్‌ ఉత్తర్వులిచ్చిన నేపథ్యంలో హెటిరో కేసు విచారణను సీబీఐ కోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది.

పెన్నా కేసులో నిందితుల జాబితాలో ఉన్న పయనీర్‌ హోల్డింగ్స్‌ వేసిన డిశ్ఛార్జి పిటిషన్‌ను సాంకేతిక అభ్యంతరాలతో సీబీఐ కోర్టు కార్యాలయం తిప్పిపంపింది. ఇదే కేసులో మరో కంపెనీ పి.ఆర్‌.ఎనర్జీ దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్‌పై విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dimple Hayathi: తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు కథతో శర్వానంద్, డింపుల్ హయతి చిత్రం బోగీ

Rajiv Kanakala: రూపాయి ఎక్కువ తీసుకున్నా నా విలువ పడిపోతుంది :రాజీవ్ కనకాల

Siddu: కన్యా కుమారి ట్రైలర్ లో హిట్ వైబ్ కనిపించింది : సిద్దు జొన్నలగడ్డ

Anushka : అనుష్క శెట్టి ఫిల్మ్ ఘాటి సెకండ్ సింగిల్ దస్సోరా రిలీజ్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments