దేశంలోని సగం రాష్ట్రాలకు పైగా నైరుతి రుతుపవనాలు ప్రవేశించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవని తెలుస్తోంది. ముఖ్యంగా రాజస్థాన్, పశ్చిమ ఉత్తర ప్రదేశ్, హర్యానా, చండీఘడ్, ఢిల్లీ, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో ఈ పరిస్థితి కొనసాగుతుంది.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా పశ్చిమ, నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నందున ఏపిలో పలు జిల్లాల్లో గాలుల ప్రభావం మినహా వర్షాలు పెద్దగా కురవడం లేదు.
అయితే రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తా, యానాంలలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాగల 48 గంటల్లో కొన్ని చోట్ల ఉత్తర కోస్తాకు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
దక్షిణ కోస్తా, రాయలసీమకు రాగల 24 గంటల్లో పలు చోట్ల మోస్తరు వర్షాలు పడనున్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు.