Publish Date: Mon, 21 Jun 2021 (05:57 IST)
Updated Date: Mon, 21 Jun 2021 (05:59 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ సడలింపుతో రేపటి నుంచి ప్రభుత్వ ఉద్యోగుల పనివేళల్లో మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తూర్పుగోదావరి జిల్లా మినహా మిగిలిన ప్రాంతాల్లో ఉద్యోగుల పని వేళలు మార్పు చేస్తూ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు.
తూర్పుగోదావరి జిల్లాలో ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పనివేళలుగా నిర్ణయించారు. మిగిలిన ప్రాంతాలన్నింటిలోనూ కార్యకలాపాలు కొవిడ్ ముందున్న సమయాల తరహాలోనే కొనసాగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఉద్యోగులకు పని వేళలుగా నిర్ణయించారు.
ఈ నెల 30వ తేదీ వరకు ఈ పనివేళలు వర్తిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల్లో తెలిపింది. అన్ని విభాగాధిపతులు, కలెక్టర్లు ఈ ఆదేశాలు అమలు చేయాలని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.