Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రి చేతుల్లోంచి జారిపడి పసికందు దుర్మణం.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో..!!

ఠాగూర్
గురువారం, 21 మార్చి 2024 (11:47 IST)
ఓ షాపింగ్‌ మాల్‌లో తండ్రి చేతుల నుంచి జారిపడిన ఓ పసికందు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ పసికందును ఆస్పత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. ఈ విషాదకర ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయ్‌పూర్‌లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
రాయ్‌పూర్‌లోని సిటీ సెంట్రల్ మాల్‌కు తమ ఇద్దరు పిల్లలతో కలిసి ఓ జంట షాపింగ్ కోసం వచ్చింది. భార్య షాపింగ్ చేస్తుండగా పిల్లలతో కలిసి భర్త బయట నిల్చొనివున్నాడు. పిల్లల్లో ఒకరికి ఐదేళ్లుకాగా, మరొకరు యేడాది వయసున్న పసికందు. ఇంతలో ఎస్కలేటర్ ఎక్కేందుకు పెద్ద కుమారుడు మారాం చేయడంతో, వద్దంటూ తండ్రి కట్టడి చేయడం కనిపించింది. 
 
ఈ క్రమంలో భుజంపై ఉన్న చిన్న కుమారుడు జారి కిందపడ్డాడు. పై ఫ్లోర్ నుంచి కింద పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే బాబు చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. తన చేతుల్లో నుంచి కొడుకు జారి పడి ప్రాణాలు పోగొట్టుకోవడంతో ఆ తండ్రి కన్నీరుమున్నీరవుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments