Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రెస్టారెంట్‌లో అందరూ చూస్తుండగానే కాల్పులు... వ్యక్తి తలపై కాల్చి.. కత్తితో పొడిచి చంపేశారు..

Advertiesment
property dealer murder

ఠాగూర్

, ఆదివారం, 17 మార్చి 2024 (10:46 IST)
మహారాష్ట్రలో ఓ దారుణ హత్య జరిగింది. పూణె - సోలాపూర్ జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. రెస్టారెంట్‌లో అందరూ చూస్తుండగానే కొందరు దండగలు వచ్చి కాల్పులు జరిపారు. ఒక టేబుల్ వద్ద తన ముగ్గురు స్నేహితులతో కలిసి కూర్చొనివున్న ఓ వ్యక్తిపై ముందుగా ఇద్దరు దండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. దీంతో ఆ వ్యక్తి టేబుల్‌పైనే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత మరికొందరు దండగులు వచ్చి కత్తితో విచక్షణా రహితంగా పొడిచాడు. ఆ తర్వాత కత్తితో గొంతుకోసి చంపేశాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన దృశ్యాలు రెస్టారెంట్‌లో అమర్చిన సీసీటీవీ ఫుటేజీల్లోన మోదయ్యాయి. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మృతుడిని 34 యేళ్ల ప్రాపర్టీ డీలర్ అవినాశ్ బాలు ధాన్వేగా గుర్తించారు. రెండు గ్యాంగుల మధ్య శత్రుత్వంగా పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
ధాన్వే మరో వ్యక్తులు రెస్టారెంట్‌లోని టేబుళ్ల వద్ద కూర్చొనివున్నారు. సమీపంలోని మరో టేబుల్ వద్ద ఇద్దరు పిల్లలతో కూడిన ఓ కుటుంబం భోజనం చేస్తుంది. ఇద్దరు వ్యక్తులు నెమ్మదిగా నడుచుకుంటూ రెస్టారెంట్‌లోకి చ్చారు. వారిలో ఒకరి చేతిలో ప్లాస్టిక్ బ్యాగ్ ఉంది. ఆ వెంటనే తుపాకులు తీసి ఫోనులో మాట్లాడుతున్న ధాన్వే తలపై కాల్పులు జరిపారు. దీంతో భయపడిన ధాన్వే, మిగిలిన ముగ్గురు అక్కడి నుంచి పారిపోయాడు. 
 
ఈ వెంటనే రెస్టారెంట్‌లోకి ఆరుగురు వ్యక్తులు ప్రవేశించి నేలపై పడిపోయిన ధాన్వేను పట్టుకుని కత్తితో పొడిచి, గొంతు కోసి చంపేశారు. మరో టేబుల్ వద్ద భోజనం చేస్తున్న ఓ కుటుంబ ప్రాణభయంతో పారిపోవడం సీసీటీవీ దృశ్యాల్లో కనిపిస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ దారుణానికి పాల్పడిన ముఠా కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైకాపా అభ్యర్థుల జాబితా... పేరుకే నా ఎస్సీలు.. బీసీసీలు.. రెడ్డి సామాజిక వర్గానికే పెద్దపీట..