Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒడిషాలో అత్యాచారాల పర్వం : ఒకే రోజు ఐదు రేప్‌లు

Webdunia
సోమవారం, 9 డిశెంబరు 2019 (10:56 IST)
ఒడిషా రాష్ట్రంలో కామాంధులు రెచ్చిపోయారు. ఒకే రోజు ఐదు ప్రాంతాల్లో అత్యాచారాలు జరిగాయి. దీంతో యువతులు, మహిళలు భయంతో వణికిపోతున్నారు. ఒంటరిగా బయట తిరగాలంటేనే జంకుతున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మయూరభంజ్ జిల్లా బాదంపహాడ్ ప్రాంతంలో 16 ఏళ్ల బాలికపై నారాయణ మండల్ (25) అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో పోలీసులు తక్షణం స్పందించి నిందితుడిని అరెస్టు చేశారు. 
 
అలాగే, గంజాం జిల్లా కళ్లికోట్‌లో జరిగిన మరో ఘటనలో నాలుగేళ్ల బాలికపై 16 ఏళ్ల బాలుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. బాలేశ్వర్ జిల్లాలో జరిగిన ఇంకో ఘటనలో బాలికపై యువకుడు అత్యాచారం యత్నం చేశాడు.
 
ఆ రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో 45 ఏళ్ల వ్యక్తి ఏడేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కటక్‌లోని కాన్‌నగర్ ప్రాంతంలోని కాళికాదేవి ఆలయం వద్ద ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. 
 
ఈ అత్యాచారాల ఘటనలన్నీ శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు 24 గంటల్లోనే జరిగాయి. దీంతో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఉలిక్కిపడింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార కేసు నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత కూడా కామాంధుల్లో ఎటువంటి మార్పు రాలేదనడానికి ఈ ఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments