Webdunia - Bharat's app for daily news and videos

Install App

#OddEven : ఢిల్లీలో విషవాయువులు.. 13 నుంచి సరిబేసి విధానం..

దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం కమ్మేసింది. ఈ నేపథ్యంలో నగరంలో ఈనెల 14 వరకు ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదు అని గ్రీన్ ట్రిబ్యునల్ గురువారం ఆదేశాలు జారీచేసింది. కాలుష్యాన్ని నియంత్రించడంలో ఢిల్లీ ప్రభుత్వ

Webdunia
గురువారం, 9 నవంబరు 2017 (14:53 IST)
దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం కమ్మేసింది. ఈ నేపథ్యంలో నగరంలో ఈనెల 14 వరకు ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదు అని గ్రీన్ ట్రిబ్యునల్ గురువారం ఆదేశాలు జారీచేసింది. కాలుష్యాన్ని నియంత్రించడంలో ఢిల్లీ ప్రభుత్వం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు దారుణంగా విఫలమయ్యాయని గ్రీన్ ట్రిబ్యునల్ మండిపడింది. 
 
ఎన్‌జీటీ ఛైర్మన్ స్వతంతర్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వం కానీ, ఏదైనా సంస్థ కానీ, లేదా వ్యక్తులు కానీ ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదు అని ట్రిబ్యునల్ ఆదేశించింది. పీఎం లెవల్స్ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో నీళ్లు చల్లాలని ట్రిబ్యునల్ సూచన చేసింది. అలాగే, సీమెంటు, ఇసుక తీసుకువెళ్లే ట్రక్కులను నిషేధించారు.
 
మరోవైపు ఢిల్లీ రోడ్లపై వాహనాల సంఖ్యను క్రమబద్దీకరించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ సరిబేసి సంఖ్యా విధానాన్ని తెరపైకి తెచ్చింది. ఈనెల 13వ తేదీ నుంచి ఈ విధానాన్ని అమలు చేయనున్నట్టు ఢిల్లీ రాష్ట్ర రవాణా మంత్రి కైలాష్ గెహ్లాట్ తెలిపారు. వారంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు. 
 
ఇంకోవైపు ఢిల్లీ ప్రభుత్వంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా విమర్శలు గుప్పించారు. ఢిల్లీలోని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ పూర్తిగా విఫలమైందంటూ ట్వీట్ చేశారు. తన వ్యాఖ్యలతో ఏకీభవిస్తే రీట్వీట్ చేయాలంటూ ఆయన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. దీనికి అనేక మంది బీజేపీ సర్కారు కంటే మేలంటూ రీట్వీట్స్ చేయడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments