Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఢిల్లీ - ఆగ్రా హైవేపై వరుస ప్రమాదాలు.. ఈ వీడియో చూసి తీరాల్సిందే...

ఉత్తరభారతాన్ని పొగమంచు దుప్పటి కప్పేసింది. పక్కన మనిషి కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. ఇక ఢిల్లీ - ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. పొగమంచు కారణంగా రహదారి ఏమాత్రం కనిపించ

Advertiesment
Delhi - Agra Highway
, బుధవారం, 8 నవంబరు 2017 (13:59 IST)
ఉత్తరభారతాన్ని పొగమంచు దుప్పటి కప్పేసింది. పక్కన మనిషి కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. ఇక ఢిల్లీ - ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. పొగమంచు కారణంగా రహదారి ఏమాత్రం కనిపించడం లేదు. ముందు, వెనక వచ్చే వాహనాలు కనిపించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముందున్న వాహనం కూడా కనిపించకపోవటంతో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఢీకొంటూ ఏకంగా 18 కార్లు దెబ్బతిన్నాయి. వీటిలో ఓ బస్సు కూడా ఉంది. అందరూ స్వల్పగాయాలతో బయటపడ్డారు.
 
వాహనాల్లోని ప్రయాణికులు ప్రమాదం జరిగిన వెంటనే కారుదిగిప్రాణభయంతో పరుగులు తీస్తున్నారు. వెనక వచ్చే వాహనాలను అలర్ట్ చేస్తున్నా ఫలితం లేదు. మనిషి సైతం కనిపించకపోవటంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో కొందరు అరుస్తూ.. కేకలు వేస్తూ అలర్ట్ ఇచ్చారు. మరికొందరు లైట్లు వేసి వాహనాలను ఆపే ప్రయత్నం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. రెండు గంటలపాటు హైవేపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నోట్ల రద్దు : రియల్ ఎస్టేట్ కుదేలు.. చితికిపోయిన చిన్నవ్యాపారులు