Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై టెస్ట్ డ్రైవింగ్ అక్కర్లేదు... ఆ స్కూల్ ట్రైనింగ్ ఉంటేచాలు...

Webdunia
ఆదివారం, 13 జూన్ 2021 (11:46 IST)
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్ లైసెన్స్ కోసం ప్రాంతీయ రవాణా కార్యాలయా(ఆర్టీవో)ల్లో టెస్ట్ డ్రైవింగ్ అక్కర్లేదని స్పష్టం చేసింది. అయితే, అధీకృత డ్రైవింగ్‌ స్కూళ్లలో శిక్షణ పూర్తిచేసుకుని, సర్టిఫికెట్‌ పొందితే చాలని తెలిపింది. 
 
ఈ సర్టిఫికేట్ ఆధారంగా టెస్ట్ లేకుండా డ్రైవింగ్‌ లైసెన్సు పొందవచ్చని తాజాగా వెల్లడించింది. ఈ విషయాన్ని కేంద్రం అధీకృత డ్రైవింగ్‌ స్కూళ్లకు శుక్రవారం విడుదల చేసిన మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. 
 
అయితే.. ఆర్టీయే నుంచి లైసెన్సులు పొందిన అధీకృత డ్రైవింగ్‌ స్కూళ్లు వాహనాల శిక్షణ కోసం సిమ్యులేటర్లను సమకూర్చుకోవడం.. కనీసం ఎకరా స్థలానికి తగ్గకుండా టెస్టింగ్‌ ట్రాక్‌లను ఏర్పాటు చేసుకోవడం వంటి మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది.
 
డ్రైవింగ్‌ స్కూల్‌లో నిర్వహించే టెస్టు వివరాలను ఆన్‌లైన్‌లో సమర్పించి, శిక్షణ తీసుకున్న వారికి సర్టిఫికెట్లు ఇస్తారు. వాటిని ఆర్టీయే కార్యాలయాల్లో డ్రైవింగ్‌ లైసెన్సు దరఖాస్తుతో జతచేస్తే సరిపోతుంది. ఎలాంటి టెస్టు లేకుండానే డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీ అవుతుందని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ ధూమ్ ధామ్ ఎలా వుందంటే.. రివ్యూ

నారా లోకేష్ గారూ, పవన్ గారూ, అనిత గారూ నన్ను క్షమించండి: దణ్ణం పెట్టి అభ్యర్థిస్తున్న శ్రీ రెడ్డి

గేమ్ ఛేంజర్ టీజర్ ముందుగా కియారా అద్వానీ లుక్ విడుదల

అరకులో ప్రారంభమైన సంక్రాంతికి వస్తున్నాం ఫైనల్ షెడ్యూల్

ఉద్యోగం కోసం ప‌డే పాట్ల నేప‌థ్యంలో ఈసారైనా? మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగులుతో చేసిన పదార్థాలు ఎందుకు తినాలి?

బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

తర్వాతి కథనం
Show comments