Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత రక్తనమూనాలు మా వద్ద లేవు: అపోలో షాక్

బెంగళూరుకు చెందిన అమృత (37) అనే మహిళ తాను జయలలిత కుమార్తెనని.. డీఎన్ఏ టెస్టు చేయాల్సిందిగా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే సుప్రీం కోర్టు హైకోర్టులోనే తేల్చుకోమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చే

Webdunia
గురువారం, 26 ఏప్రియల్ 2018 (17:00 IST)
బెంగళూరుకు చెందిన అమృత (37) అనే మహిళ తాను జయలలిత కుమార్తెనని.. డీఎన్ఏ టెస్టు చేయాల్సిందిగా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే సుప్రీం కోర్టు హైకోర్టులోనే తేల్చుకోమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో అమృత మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో అమృత డీఎన్ఎ పరీక్ష కేసు మలుపు తిరిగింది.


ఈ అంశంపై అమృత దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు విచారణ జరుపుతోంది. 2016 జయమ్మ అనారోగ్యంతో 75 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో జయలలిత కుమార్తెనని అమృత నిరూపించుకోవాలంటే.. జయలలితకు సంబంధించిన బయోలాజికల్‌ నమూనాలు ఏవైనా సేకరించి ఉంచారా, లేదా అనే విషయంపై సమాచారం ఇవ్వాలని అపోలో ఆస్పత్రిని కోర్టు బుధవారం (ఏప్రిల్ 25) ఆదేశించింది.

కానీ అపోలో ఆస్పత్రి మాత్రం తమ వద్ద బయోలాజికల్ శాంపిల్స్ లేవని షాక్ ఇచ్చింది. ఇంతకుముందు.. జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందినప్పటి సీసీటీవీ దృశ్యాల గురించి కోరగా అపోలో ఆసుపత్రి యాజమాన్యం ఇదేవిధమైన సమాధానం చెప్పి అందర్నీ షాక్‌కు గురిచేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments