కేరళ రాష్ట్రంలో అసహజ మరణాలు.. కోళికోడ్‌కు ప్రత్యేక వైద్య బృందం

Webdunia
బుధవారం, 13 సెప్టెంబరు 2023 (12:56 IST)
కేరళ రాష్ట్రంలో రెండు అసహజ మరణాలు సంభవించాయి. ఇవి నిఫా వైరస్ కారణంగానే సంభవించినట్టు భావిస్తున్నారు. దీంతో ఆ రాష్ట్రానికి ప్రత్యేక వైద్య బృందాన్ని కేంద్రం పంపించింది. ఈ ప్రాణాంతక వైరస్ మరో ఇద్దరు వైద్యులకు కూడా సోకినట్టు కేంద్రం తేల్చింది. 
 
ప్రస్తుతం బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు, కేరళలో పరిస్థితిని సమీక్షించి రాష్ట్ర ప్రభుత్వానికి సాయం చేసేందుకు కేంద్ర బృందం కేరళకు చేరుకుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి మాన్సుఖ్ మాండవీయ తాజాగా ఓ ప్రకటన చేశారు. నీఫా వైరస్ కారణంగా తొలి మరణం ఆగస్టు 30న సంభవించగా మరో వ్యక్తి సోమవారం కన్నుమూశారు. 
 
'రాష్ట్రంలో నీపా వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. దీని వల్ల ఇద్దరు మరణించారు. మొత్తం నలుగురి శాంపిళ్లు పరీక్షలకు పంపించగా ఇద్దరికి నీపా వైరస్ సోకినట్టు తేలింది. మరో ఇద్దరికి రిపోర్టుల్లో నెగెటివ్ వచ్చింది' అని ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేశారు. 
 
మరోవైపు, నిఫా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇప్పటికే ఓ కంట్రోల్ రూం ఏర్పాటు చేసిన ప్రభుత్వం, ప్రజలు మాస్కులు ధరించాలని సూచించింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments