తొమ్మిది మంది బీఎస్ఎఫ్‌ జవాన్లకు కరోనా.. సీఐఎస్ఎఫ్ మృతి

Webdunia
మంగళవారం, 12 మే 2020 (18:35 IST)
బీఎస్ఎఫ్‌ జవాన్లు తొమ్మిది మందికి కరోనా సోకింది. కొత్తగా నమోదైన కేసుల్లో ఢిల్లీ నుంచి 6, త్రిపుర నుంచి 2 వరకు ఉండగా.. కోల్‌కతాలో మరో జవానుకు కొవిడ్-19 సోకినట్టు గుర్తించారు. వీరందరినీ చికిత్స నిమిత్తం కోవిడ్-19 హెల్త్ కేర్ ఆస్పత్రులకు తరలించినట్టు బీఎస్ఎఫ్ ఓ ప్రకటనలో పేర్కొంది. 

అలాగే కరోనా అన్ని వర్గాల వారిపై విరుచుకుపడుతోంది. డిఫెన్స్‌లో కూడా పలువురికి సోకుతోంది. తాజాగా ఈ మహమ్మారి ధాటికి ఒక సీఐఎస్ఎఫ్ అధికారి మరణించారు. కరోనా సోకిన ఓ ఏఎస్ఐ కోల్‌కతాలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇప్పటి వరకూ సీఐఎస్ఎఫ్‌లో 68 మందికి కరోనా సోకగా.. ఇద్దరు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 
 
కాగా, భారత్‌లో కొవిడ్-19 ఉధృతి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 3,604 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 70,756కు పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. 
 
గత 24 గంటల్లో మరో 87 మంది ప్రాణాలు కోల్పోవడంతో... దేశ వ్యాప్తంగా కరోనా మరణాలు 2,293కు చేరుకున్నాయి. కాగా ప్రస్తుతం 46,008 మంది కోవిడ్-19 బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా... ఇప్పటి వరకు 22,454 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments