Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరోటాలు తింటూ భార్యతో మాట్లాడిన కొత్త పెళ్లికొడుకు మృతి

Webdunia
శుక్రవారం, 5 జులై 2019 (19:33 IST)
కొత్తగా పెళ్లైన దంపతులు ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తం చేస్తుండటం మామూలే. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్‌లు చేతిలో వుండటంతో ఎక్కడిపడితే అక్కడ ఫోనుల్లోనే కొత్త దంపతులు కాలం గడిపేస్తున్నారు. అలా తన భార్యతో మాట్లాడుతూ.. పరోటాలు తిన్న కొత్త పెళ్లి కొడుకు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.


వివరాల్లోకి వెళితే.. పుదుక్కోట్టై జిల్లా కరువక్కుడికి చెందిన పురుషోత్తమన్.. ఓ ప్రైవేట్ షోరూమ్‌లో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఆరు నెలల క్రితం.. నెల్లైకి చెందిన షణ్ముగ సుందరితో వివాహం జరిగింది. 
 
ఈ నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం.. షణ్ముగ సుందరి తన పుట్టింటికి వెళ్లింది. దీంతో గురువారం రాత్రి ఓ షాపులో పరోటాలను కొని ఇంట్లో కూర్చుని తింటూ వున్న భర్తకు ఆమె ఫోన్ చేసింది.

ఫోన్ ఆన్ చేసి భార్యతో మాట్లాడుకుంటుండగా.. వేడి వేడిగా వున్న పరోటా ముక్కలు గొంతులో చిక్కుకున్నాయి. దీంతో గొంతులో మాటరాలేదు. వెంటనే భర్త మాట్లాడలేకపోతున్నాడనే సమాచారాన్ని షణ్ముగ సుందరి అతని బంధువులకు చెప్పింది. వారు అతని వద్దకు వెళ్లి చూసి షాకయ్యారు. 
 
పరోటా గొంతులో చిక్కుకుని పోరాడుతున్న ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న పురుషోత్తమన్‌ను ఆస్పత్రికి తరలించారు. కానీ మార్గమధ్యలోనే పురుషోత్తమన్ మృతి చెందాడు. ఈ విషయం తెలిసి ఆతని భార్య షణ్ముగ సుందరి బోరున విలపించింది. దీంతో కొత్తగా పెళ్లైన పురుషోత్తమన్, షణ్ముగ సుందరి ఇళ్లల్లో విషాదం నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments