కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో యువతకు ఒక శుభవార్త అందించింది. అదేంటంటే మొబైల్ ఫోన్ల ధరలు మరింత తగ్గనున్నాయి.
సెల్యులార్ మొబైల్ ఫోన్‌లలో ఉపయోగించే కెమెరా మాడ్యూల్, చార్జర్, అడాప్టర్‌లపై కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీని తగ్గించింది. దీంతో మొబైల్ ఫోన్ల ధరలు మరింత తగ్గనున్నాయి.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొలిసారిగా శుక్రవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే ఇండియాలో స్మార్ట్‌ఫోన్‌ల మార్గెట్ దినదినాభివృద్ధి చెందుతోంది.
ఇండియాలో మొబైల్ ఫోన్ మార్కెట్ 2018లో 14.5 శాతం పెరగగా, 2019లో 15 శాతానికి పెరగనుందని, 2021 నాటికి ఇండియాలో మొబైల్ సబ్‌స్క్రిప్షన్ 1.4 బిలియన్లకు పెరగనుందని అంచనా.