Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న అజిత్ పవార్

Webdunia
సోమవారం, 16 జనవరి 2023 (08:59 IST)
మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అజిత్ పవార్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. నాలుగో అంతస్తు నుంచి లిఫ్టులో కిందకు దిగుతుండగా, లిఫ్టు వైరు తెగిపోయింది. దీంతో లిఫ్టు అత్యంత వేగంతో కిందికి జారిపడింది. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పూణెలోని హార్దికర్ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. ఆ ఆస్పత్రి ప్రారంభోత్సవ సమయంలో జరిగింది. 
 
ప్రమాదం జరిగినపుడు లిఫ్టులో అజిత్ పవార్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు లిఫ్టులో ప్రయాణిస్తున్నారు. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయాన్ని అజిత్ పవార్ స్వయంగా వెల్లడించారు. ప్రమాద సమయంలో తనతో పాటు 90 యేళ్ల వైద్యుడు డాక్టర్ రెడీకర్, పోలీసులు కూడా లిఫ్టులో ఉన్నారు. 
 
తాము లిఫ్టులోకి వెళ్ళిన వెంటనే విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, ఆ వెంటనే లిఫ్టు నాలుగో అంతస్తు నుంచి వేగంగా కిందపడపోవడం అంతా క్షణాల్లో జరిగిపోయిందన్నారు. ఆ తర్వాత లిఫ్టు డోర్లు పగులగొట్టి వారిని సురక్షితంగా రక్షించారు. ఈ ప్రమాదం గురించి తాను ఎవరికీ చెప్పలేదని, లేదంటే ఆదివారమే ఈ విషయం పెద్ద బ్రేకింగ్ న్యూస్‌గా వచ్చేదని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments