చైనాకు చెందిన ఓ సంస్థ దుబాయ్ లో ఎలక్ట్రిక్ ప్లైయింగ్ కారును విజయవంతంగా ప్రయోగించింది. జిపెంగ్ ఎక్స్ 2, గ్వాంజొ సంస్థ దీనిని డెవలప్ చేసింది. ప్రపంచంలో ఉన్న డజన్ ప్లైయింగ్ కార్లలో ఇదీ ఒకటిగా నిలిచింది. ఆ కారును విజయవంతంగా పరీక్షించారు. అయితే అందుబాటులోకి రావడానికి చాలా సమయమే పట్టేలా ఉంది. ఇదే కాదు 2021 జూలైలో మానవ సహిత విమాన పరీక్ష కూడా నిర్వహించారు.
8 ప్రొపెలర్ సెట్ ద్వారా కారు శక్తిని పొందుతుంది. కారు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. విమానం, హెలికాప్టర్ మాదిరిగా కాకుండా..ఇ విఐఒఎల్.. ఎలక్ట్రిక్ వాహనాలు. క్విక్ పాయింట్ పర్సనల్ ట్రావెల్ ఆధారంగా ల్యాండ్ అవుతాయి.
ఈ కారు రోజంతా ఒక పట్టణంలో ప్రయాణం చేయగలదట. అయితే బ్యాటరీ లైఫ్, ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, మౌలిక సదుపాయల అంశం ఇప్పటికీ సవాళ్లను ఎదుర్కొంటుంది.
దీనిపై విదేశాంగ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సిందియా కూడా స్పందించారు. అమెరికా, కెనడాలో ట్రయల్స్ ముగిసిన తర్వాత దేశంలో కూడా ఈ-వొటీఐఎల్ రూపంలో అర్బన్ ఎయిర్ మొబిలిటీ ఆధారంగా ట్రయల్ చేస్తామని పేర్కొన్నారు. ఈ కారులో మాత్రం ఇద్దరు వెళ్లడానికి వీలు ఉంది.