Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫుట్‌బాల్‌ అభిమానులకు గుడ్ న్యూస్.. AIFFపై సస్పెన్షన్ ఎత్తివేత!

Foot Ball
, శనివారం, 27 ఆగస్టు 2022 (14:10 IST)
ఫుట్‌బాల్‌ అభిమానులకు గుడ్ న్యూస్. ఆల్‌ఇండియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌(ఏఐఎఫ్‌ఎఫ్‌)పై విధించిన నిషేధాన్ని అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఫిఫా) ఎత్తివేసింది. 
 
ఏఐఎఫ్‌ఎఫ్‌లో కమిటీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేటర్స్‌ (సీఓఏ) ప్రమేయాన్ని సుప్రీం కోర్టు నిలువరించిన నేపథ్యంలో ఫిఫా తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో భారత్‌ వేదికగా అక్టోబర్‌లో జరుగాల్సిన ప్రతిష్ఠాత్మక మహిళల అండర్‌-17 ప్రపంచ కప్‌ టోర్నీ నిర్వహణకు మార్గం సుగమమైంది. 
 
ఏఐఎఫ్‌ఎఫ్‌ పరిపాలన వ్యవహారాల్లో సీవోఏ కలుగజేసుకోవడంపై సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. దీంతో తిరిగి పాలన పగ్గాలు ఏఐఎఫ్‌ఎఫ్‌ చేతుల్లోకి వచ్చాయి. ఈ విషయాన్ని  పరిగణనలోకి తీసుకున్న ఫిఫా కౌన్సిల్‌ సస్పెన్షన్‌ ఎత్తివేతకు మొగ్గుచూపింది. 
 
ఈ కారణంగా షెడ్యూల్‌ ప్రకారం మహిళల అండర్‌-17 ప్రపంచకప్‌ నిర్వహణకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. నిబంధనలకు అనుగుణంగా ఏఐఎఫ్‌ఎఫ్‌ ఎన్నికలు జరిగేలా ఆసియా ఫుట్‌బాల్‌ కాన్ఫిడరేషన్‌ (AFC) పర్యవేక్షిస్తుంది’ అని ఫిఫా తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సారా టెండూల్కర్‌తో బ్రేకప్.. ఇక కెరీర్‌పై దృష్టి పెడతా... శుభ్ మన్ గిల్?