హాలీవుడ్ సినిమా తరహాలో త్వరలోనే రోడ్లమీద ఎగిరేకార్లు రాబోతున్నాయి. రోడ్డుపై ప్రయాణం చేస్తున్న కారు రెండు నిమిషాల్లో విమానం మాదిరిగా మారిపోయి ఆకాశంలో ఎగిరిపోతుంది. స్లోవేకియా రాజదాని బ్లాటిస్లావాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎగిరే కారు విషయంలో ముందడుగు పడింది. త్వరలోనే ఈ కారు లండన్ నుంచి ప్యారిస్‌కు ప్రయాణం చేయనుందని సమాచారం.
గంటకు 300 కిమీ వేగంతో 82 వేల అడుగుల ఎత్తులో ప్రయాణం చేసే కారుకు ఎయిర్ వర్తీనెస్ సర్టిఫికెట్‌ను జారీ చేసింది స్లోవేకియా ప్రభుత్వం. సుమారు 70 గంటలపాటు టెస్ట్ డ్రైవింగ్‌ను నిర్వహించారు. 500 కిమీ ప్రయాణం చేయడానికి 28 లీటర్ల పెట్రోల్ సరిపోతుందని, దీని ఖరీదు రూ. 4.5 కోట్ల నుంచి 5 కోట్ల వరకు ఉంటుందని క్లెయిన్ విజన్ కంపెనీ స్పష్టం చేసింది.