మెక్‌లారెన్ స్ట్రాటజిక్ వెంచర్స్ (ఎంఎస్‌వీ) నేడు అట్లాస్ సిలికాన్‌ను విడుదల చేసింది. మొట్టమొదటి కృత్రిమ మేథస్సు (ఏఐ) అనుకూలీకరణ చిప్ డిజైన్ వెంచర్ ఇది. అంతర్జాతీయ సెమీకండక్టర్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చే సామర్థ్యం దీనికి ఉంది. ఒకే గూటి కింద నేపథ్యం, డిజైన్, ఐపీ మరియు ఉత్పత్తిని తీసుకువచ్చి డిజిటల్ సినర్జీలను సృష్టించే సమగ్రమైన పర్యావరణ వ్యవస్థ అట్లాస్ సిలికాన్.
ఈ సంస్థకు చిప్ డిజైన్‌లో ప్రత్యేకమైన సామర్థ్యాలు ఉండటంతో పాటుగా అంతర్జాతీయంగా పలు విభాగాలలో అగ్రగాములైన సంస్థలతో కలిసి పనిచేయనుంది. ఈ గ్రూప్ వృద్ధి ప్రణాళికలను విస్తరిస్తూ ఎంఎస్‌వీ ఇప్పుడు భారతదేశంలో భారీ పెట్టుబడులను పెట్టనున్నట్లు వెల్లడించింది. దీనిలో భాగంగా 2025 నాటికి 300 మిలియన్ డాలర్ల వ్యాపారం ఏర్పాటుచేయనుంది.
ఎంఎస్‌వీ ఇప్పటికే విస్తృతస్ధాయిలో ఉద్యోగుల నియామకం చేపట్టింది. భారతదేశంలో 100 ఏఎస్‌ఐసీ ఇంజినీర్లను నియమించుకోవడంతో పాటుగా దేశంలో అత్యున్నత సాంకేతిక సంస్థలతో చర్చలు జరిపి ప్రతిభావంతులైన విద్యార్థులను సైతం నియమించుకునేందుకు ప్రణాళిక చేసింది.
జాతీయ సెమీ కండక్టర్ పాలసీతో పాటుగా అనుకూలమైన భారత ప్రభుత్వ నిర్ణయాల కారణంగా భారతీయ తయారీ సామర్థ్యం మరింత విస్తరించడంతో పాటుగా ఈ విభాగంలో అపార అవకాశాలకూ కారణమవుతుంది. అట్లాస్ సిలికాన్‌తో భారతదేశ వ్యాప్తంగా ఏఎస్‌ఐసీ ప్రతిభావంతులు ప్రయోజనం పొందగలరు. పరిశ్రమ నిపుణుల మద్దతుతో ఔత్సాహిక యువతకు సైతం మేము శిక్షణ అందించడం ద్వారా సాటిలేని సేవలను అందించనున్నాం అని సాజన్ పిళ్లై, ఛైర్మన్, మెక్‌లారెన్ స్ట్రాటజిక్ వెంచర్స్ అన్నారు.
సామర్థ్యం కలిగిన స్టార్టప్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు మేము చూస్తున్నాము. అలాగే భారతదేశంతో పాటుగా దక్షిణాసియా దేశాలలో ఈ రంగంలో మధ్య తరహా కంపెనీలలోనూ పెట్టుబడులు పెట్టనున్నాము అని పిళ్లై తెలిపారు.