స్లొవేకియాలో ఎగిరే కారు ట్రయల్ రన్ విజయవంతం అయ్యింది. నిత్రా విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కారు దాదాపు 8వేల ఎత్తుకు ఎగిరి రాజధాని బ్రాటిస్లావా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. 2.15 నిమిషాల్లోనే విమానంగా మారిపోయే ఈ కారు.. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుంది.
ఈ ఎగిరే కారు ఒకసారి ఇంధనం నింపుకుంటే వెయ్యి కిలోమీటర్ల మేర ప్రయాణిస్తుంది. ఈ వాహనంలో ఇద్దరు వ్యక్తులు ప్రయాణించగలరు. ఈ కారు తయారీకి రెండేళ్లు పట్టిందని.. ఈ కారు సృష్టికర్త స్టీఫెన్ క్లిన్ తెలిపారు.