Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాపులర్ గ్లోబల్ లీడర్లలో ప్రధాని మోడీయే టాప్!

Webdunia
శుక్రవారం, 18 జూన్ 2021 (19:12 IST)
ప్రపంచ స్థాయిలో ప్రజాధారణ కలిగిన నేతల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోమారు అగ్రస్థానంలో నిలిచారు. అమెరికన్ డేటా ఇంటెలిజెన్స్ సంస్థ ‘ది మోర్నింగ్ కన్సల్ట్’ నిర్వహించిన సర్వేలో మోడీకి అత్యధిక ఓట్లు లభించాయి. ఈ సర్వేలో మొత్తం 13 దేశాల నేతలపై అభిప్రాయాలను సేకరించారు. 
 
‘ది మోర్నింగ్ కన్సల్ట్’ నిర్వహించిన గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్ ట్రాకర్ సర్వేలో అమెరికా, బ్రిటన్, రష్యా, ఆస్ట్రేలియా, కెనడా, బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ, భారత దేశం సహా 13 దేశాల నేతలపై అభిప్రాయాలను సేకరించారు. ఈ సర్వేలో భాగంగా, ఎన్నికైన ప్రజా ప్రతినిధుల నేషనల్ రేటింగ్స్‌ను ట్రాక్ చేశారు. 
 
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి 66 శాతం అప్రూవల్ రేటింగ్ వచ్చింది. అయితే అంతకుముందు కన్నా ఆయన అప్రూవల్ రేటింగ్ 20 పాయింట్లు తగ్గడం గమనార్హం. అయినప్పటికీ ఆయన మిగిలిన నేతలందరినీ వెనుకకు నెట్టారని ఈ సంస్థ ఇచ్చిన ట్వీట్‌లో తెలిపింది. 
 
గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్ ట్రాకర్‌ను గురువారం అప్‌డేట్ చేశారు. భారతదేశంలో 2,126 మంది వయోజనులు ఈ సర్వేలో పాల్గొన్నట్లు ఈ సంస్థ తెలిపింది. మోడీకి 66 శాతం అప్రూవల్ రేటింగ్ వచ్చిందని, 28 శాతం మంది ఆయనను ఆమోదించలేదని తెలిపింది. 
 
తాజా సర్వేలో మోడీకి ప్రథమ స్థానం రాగా, రెండో స్థానంలో ఇటలీ ప్రధాన మంత్రి మరియో డ్రఘి (65 శాతం) నిలిచారు. మెక్సికో ప్రెసిడెంట్ ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రడోర్ 63 శాతం అప్రూవల్ రేటింగ్‌తో మూడో స్థానంలో నిలిచారు. 
 
ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఆస్ట్రేలియా పీఎం స్కాట్ మారిసన్ (54 శాతం), జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ (53 శాతం), అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (53 శాతం), కెనడా పీఎం జస్టిన్ ట్రుడూ (48 శాతం), బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ (44 శాతం) ఉన్నారు. 
 
దక్షిణ కొరియా ప్రెసిడెంట్ మూన్ జే ఇన్ (37 శాతం), స్పానిష్ స్పెయిన్ పెడ్రో శాంచెజ్ (36 శాతం), బ్రెజిల్ ప్రెసిడెంట్ జైరే బోల్సోనారో (35 శాతం), ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమ్మాన్యుయేల్ మాక్రన్ (35 శాతం), జపనీస్ పీఎం యొషిహిడే సుగ (29 శాతం) నిలిచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments