Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మోదీజీ..షేవ్ చేసుకోండి. రూ.100 పంపుతున్నా... టీ దుకాణం యజమాని...

మోదీజీ..షేవ్ చేసుకోండి. రూ.100 పంపుతున్నా... టీ దుకాణం యజమాని...
, గురువారం, 10 జూన్ 2021 (11:35 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత కొన్ని నెలలుగా గడ్డం పెంచుతున్నారు. దీనికి వెనుక గల కారణం ఎంటో ఎవరికీ తెలియదు. కానీ, అయోధ్యలో రామాలయ నిర్మాణానికి శుంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఆయన షేవింగ్ చేసుకోవడం మానేశారు. ఫలితంగా ఇపుడు ఓ సాధువులా ఆయన కనిపిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో మహారాష్ట్రకు చెందిన అనిల్ మోరే ఓ టీస్టాల్ యజమాని ప్రధాని మోడీకి ఓ లేఖ రాశారు. ఆ గడ్డంలో చూడలేక పోతున్నాం. పైగా, ఆయన ఏదైనా పెంచాలనుకుంటే అది దేశ ప్రజలకు ఉపయోగపడేది అయి ఉండాలంటూ మోడీకి సూచన చేస్తూ ఓ లేఖను రాశారు. ఈ లేఖలో తన నిరసనను వ్యక్తం చేశాడు. 
 
అంతేకాదు, వెంటనే గడ్డం గీసుకోవాలంటూ వంద రూపాయలు కూడా పంపాడు. కరోనా కారణంగా గతేడాది నుంచి అసంఘటిత రంగ కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావించించారు. బారామతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి ఎదురుగా టీస్టాల్ నిర్వహిస్తున్నాడు.
 
ప్రధాని నరేంద్ర మోడీ గడ్డం పెంచడంమాని, ప్రజలకు వీలైనంత త్వరగా టీకాలు, వైద్య సదుపాయాలు అందించేందుకు ప్రయత్నించాలని అనిల్ మోరే కోరాడు. లాక్డౌన్‌ల వల్ల ఎదుర్కొంటున్న కష్టాల నుంచి ప్రజలను బయటపడేయడంపై ప్రధాని దృష్టి సారించాలని ఆ లేఖలో పేర్కొన్నాడు. ప్రధాని మోడీ అంటే తనకు ఎంతో గౌరవమని పేర్కొన్న మోరే.. తాను దాచుకున్న డబ్బుల నుంచి వంద రూపాయలు పంపిస్తున్నానని, ఆ డబ్బులతో ఆయన గడ్డం గీయించుకోవాలని సూచించాడు. 
 
పైగా, తన చర్యతో మోడీని అవమానించడం, బాధపెట్టడం తన ఉద్దేశం కాదని, ఆయన ఈ దేశానికి అత్యున్నత నాయకుడని కొనియాడాడు. మహమ్మారి కారణంగా దేశ ప్రజలు, పేదలు పడుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు మోరే తన లేఖలో వివరించాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో ఆందోళన కలిగిస్తున్న కరోనా బాధితుల మరణాలు