Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీని ఎంపీ అభ్యర్థిగా నామినేట్ చేసిన కాటికాపరి కుటుంబ సభ్యుడు

Webdunia
శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (16:30 IST)
లోక్‌సభ సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారణాసి స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన తన నామినేషన్ పత్రాలను శుక్రవారం సమర్పించారు. గత ఎన్నికల్లో వారణాసితోపాటు వడోదరాలో పోటీ చేసి గెలుపొందారు. ఫలితాల తర్వాత వడోదరా స్థానానికి రాజీనామా చేసి, వారణాసి స్థానం నుంచి ప్రాతినిథ్యం వహించారు. 
 
ఈ 17వ లోక్‌సభ ఎన్నికల్లో ఆయన వారణాసి నుంచే పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. కాగా, మోడీని ఎంపీ అభ్యర్థిగా ప్రతిపాదించినవారిలో ఓ కాటికాపరి కుటుంబ సభ్యుడు కూడా ఉండటం ఆసక్తి కలిగిస్తోంది. వారణాసిలోని ప్రఖ్యాత మణికర్ణిక ఘాట్ వద్ద దహనసంస్కారాలు నిర్వహించే కుటుంబానికి చెందిన ఓ వ్యక్తికి నరేంద్ర మోడీ తనను నామినేట్ చేసే అవకాశం కల్పించారు. 
 
అంతేకాగాకుండా, ఆయన పేరును ప్రతిపాదించినవారిలో ఓ వాచ్‌మన్, ఓ స్కూలు ప్రధానోపాధ్యాయురాలు, బీజేపీ సీనియర్ నేత కూడా ఉన్నారు. నామినేషన్ దాఖలు చేయడానికి ముందు మోడీ స్థానిక కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎన్డీయే భాగస్వాములైన ప్రకాశ్ సింగ్ బాదల్, అన్నపూర్ణ శుక్లా వంటి పెద్దవాళ్లకు మోడీ సనాతన ధర్మం ప్రకారం పాదాభివందనం చేసి నామినేషన్ దాఖలుకు బయల్దేరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments