ఆ మహిళ పండించిన మామిడి పండు ధర రూ.10 వేలు!!

ఠాగూర్
శుక్రవారం, 21 మార్చి 2025 (09:15 IST)
మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ పండించిన మామిడి పండు ధర దేశంలో అత్యధిక ధర పలికింది. ఈ పండు ధర ఏకంగా రూ.10 వేలు పలికింది. మహారాష్ట్రలో ఏర్పాటుచేసిన వ్యవసాయ ప్రదర్శనలో ఒక్కో మామిడి భారీ రేటుకు అమ్ముడుపోయాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన ఓ మహిళ రైతు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మియాజాకీ రకానికి చెందిన మామిడిపండును పండించారు. నాదేండ్ జిల్లా భోసీ గ్రామానికి చెందిన సుమన్ బాబు గ్వైక్వాడ్ ఈ మామిడి పండును సాగు చేశారు. ఇటీవల నిర్వహించిన వ్యవసాయ క్షేత్రంలో ఒక్కో మామిడి పండు ధర రూ.10 వేల చొప్పున విక్రయించారు. ఈ రకం మామిడిని సాగు చేయడం వెనుక ఓ కథ కూడా ఉందని ఆ మహిళ అంటున్నారు. 
 
సుమన్ బాయి కుమారుడు నందకిశోర్ యూపీఎస్సీ పరీక్ష కోసం పూణెలోని కోచింగ్ సెంటరులో చేరారు. అయితే, కరోనా కారణంగా ఆ సెంటర్ మూతపడటంతో ఆయన తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో ఉంటూ పరీక్షలకు సిద్ధమవుతున్న నందకిషోర్ ఆన్‌లైన్‌లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జపాన్‌కు చెందిన మియాజాకీ మామిడి పండు గురించి తెలుసుకున్నాడు. 
 
తాము కూడా ఈ సాగు చేపడితే బాగుంటుందని భావించి తల్లికి చెప్పాడు. ఆ తర్వాత ఒక్కో దానికి రూ.6500 చొప్పున చెల్లించి ఫిలిప్పీన్స్ నుంచి మొత్తం 10 మొక్కలను తెప్పించి సాగు మొగలుపెట్టాడు. రెండేళ్ల క్రితం సాగు చేపట్టగా ఈ యేడాది కాపువచ్చింది. ఒక్కో చెట్టుకు 10 నుంచి 12 కాయలు వచ్చాయి. తాజాగా వాటిని వ్యవసాయ ప్రదర్శనలో ఉంచగా, ఒక్కో పండు ధర రూ.10 వేలు చొప్పున అమ్ముడుపోయాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

ఘంటసాల స్క్రిప్ట్ ఎంతో ఎమోషనల్‌గా ఉంటుంది : ఆదిత్య హాసన్

సంగీత్ శోభన్ హీరోగా పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో సినిమా ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments