Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బుకు కొదవలేదు - బుర్రలో రూ.200 కోట్ల విలువైన ఆలోచనలు ఉన్నాయ్... నితిన్ గడ్కరీ

ఠాగూర్
సోమవారం, 15 సెప్టెంబరు 2025 (14:57 IST)
తనకు డబ్బుకు కొదవలేదని, అదేసమయంలో తన బుర్రలో రూ.200 కోట్ల విలువైన ఆలోచనలు ఉన్నాయని, పైగా తాను ఎవరినీ మోసం చేయకుండానే డబ్బు  సంపాదిస్తున్నానని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, తనకు నెలకు రూ.200 కోట్ల ఆదాయం వస్తోందన్నారు. 'ఎవరినీ మోసం చేయాల్సిన అవసరం నాకు లేదు. నా వ్యాపారాలు నిజాయితీతో నడుస్తున్నాయి' అని ఆయన నొక్కి చెప్పారు. తన కుమారులు వ్యాపారాల్లో ఉన్నప్పటికీ, తాను వారికి కేవలం సలహాదారుడిగా మాత్రమే ఉన్నానని ఆయన తెలిపారు.
 
'ఇటీవల నా కుమారుడు ఇరాన్ నుంచి 800 కంటైనర్ల ఆపిల్స్‌ను దిగుమతి చేశాడు. అలాగే 1000 కంటైనర్ల అరటిపళ్లను ఎగుమతి చేశాడు. మా వ్యాపారాలు వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకే. నాకు డబ్బుకు కొదవలేదు' అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈ20 ఇంధనం, 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్‌పై వస్తున్న విమర్శలపై గడ్కరీ తీవ్రంగా స్పందించారు. ఈ విధానం వల్ల తన కుటుంబానికి లాభం చేకూరుతోందంటూ వస్తున్న ఆరోపణలు పూర్తిగా అబద్ధమని ఆయన ఖండించారు.
 
'ఇది పెట్రోల్ లాబీల కుట్ర. రాజకీయంగా నన్ను లక్ష్యంగా చేసుకుని పెయిడ్ సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా ఈ20పై దాఖలైన పిల్‌ను తిరస్కరించింది' అని ఆయన గుర్తు చేశారు. ఈ ఇంధనం సురక్షితమైనదని, ఇది దిగుమతి ప్రత్యామ్నాయంగా, కాలుష్యాన్ని తగ్గించేందుకు, రైతులకు లాభం చేకూర్చే విధంగా రూపొందించామని గడ్కరీ వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ హౌస్‌లో నటించడం సులభం.. కానీ అసలు రంగు బయటపడుతుంది...

Maruthi: వాళ్లిద్దరూ లేకుంటే నేను ఇక్కడ ఉండేవాడ్ని కాదు : డైరెక్టర్ మారుతి

Vijay: బిచ్చగాడు డైరెక్టర్ శశి, విజయ్ ఆంటోని కాంబినేషన్లో భారీ ప్రాజెక్టు

Dhanush: ధనుష్, నిత్యా మీనన్ ల ఇడ్లీ కొట్టు లో ఏం జరిగింది..

Pawan: ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ పూర్తి చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తినాలి? ఏవి తినకూడదు?

Mustard oil: ఆవనూనెతో ఆరోగ్యం మాత్రమే కాదు.. అందం కూడా..?

Coconut Milk: జుట్టు ఆరోగ్యానికి కొబ్బరి పాలు.. ఎలా వాడాలంటే?

Juvenile Arthritis: పిల్లల్లో కనిపించే జువెనైల్ ఆర్థరైటిస్.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

తర్వాతి కథనం
Show comments