Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

న్యూస్ రీల్ మాత్రమే చూశారు .. అసలైన సినిమా ముందుంది : నితిన్ గడ్కరీ

Advertiesment
nitin gadkari

ఠాగూర్

, శనివారం, 21 జూన్ 2025 (23:05 IST)
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత 11 యేళ్లలో తన గురించి చూసింది కేవలం న్యూస్ రీల్ మాత్రమేనని, అసలైన సినిమా ఇంకా మిగిలేవుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఏదేమైనా తాను చేయాల్సిన పనులను పార్టీ నిర్ణయిస్తుందని, ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. 
 
"ఇప్పటివరకు చూసిందంతా న్యూస్ రీల్ మాత్రమే. అసలైన సినిమా ఇంకా ప్రారంభంకాలేదు. కార్యకర్తలు నేను నిర్వహిస్తా. ఇటీవల రోడ్ల పనుల కంటే వ్యవసాయం ఇతర సామాజిక కార్యక్రమాలపై నేను ఎక్కువగా దృష్టిసారిస్తున్నా" అని ఆయన పేర్కొన్నారు. 11 యేళ్ల మోడీ పాలన గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన గడ్కరీ.. విదర్భలో రైతుల ఆత్మహత్యలను ఆపేందుకు కృషి చేయాలన్నదే తన కోరిక అన్నారు. 
 
జనాభా నియంత్రణను భాషా లేదా మతపరమైన సమస్యగా కాకుండా ఆర్థిక సమస్యగా చూడాలన్నారు. చాలా అభివృద్ధి జరుగుతున్నా ఫలితాలు మాత్రం అందరికీ అందడం లేదన్నారు. ఇందుకు జనాభా పెరుగుదలే కారణమన్నారు. గత రెండు పర్యాయాల్లో మోడీ ప్రభుత్వం సాధించిన అనేక విజయాలను ఈ సందర్భంగా గడ్కరీ ప్రస్తావించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియురాలని ఇంప్రెస్ చేద్దామనుకుని జైలుపాలైన ప్రియుడు!