Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందమైన స్నేహితురాలిని వారికి పరిచయం చేసింది.. ఇక నువ్వు మాకెందుకూ అని...

Webdunia
శుక్రవారం, 9 నవంబరు 2018 (19:08 IST)
తమిళనాడు రాజధాని చెన్నై మెరీనా బీచ్‌లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. నవంబర్ నాలుగో తేదీ చెన్నై మెరీనాలో ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ హత్యకు కారణం పోటీపడి వ్యభిచారం చేయడమేనని పోలీసులు చెప్తున్నారు. ఈ హత్యకు సంబంధించిన విచారణలో సూర్య అనే వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలం కీలకంగా మారిందని పోలీసులు తెలిపారు. 
 
హత్యకు గురైన మహిళ పేరు కలై అని.. ఆమె మెరీనాలో వ్యభిచార వృత్తిని చేసేదని.. ఆ సమయంలో ఆమెకు వినోద్ కుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వినోద్ కుమార్ అతని స్నేహితుడు సూర్య కలైతో అప్పుడప్పుడు శారీరకంగా కలిసేవారని తెలిసింది. ఈ నేపథ్యంలో ఇటీవల వినోద్ కుమార్‌కు కలై తన స్నేహితురాలిని పరిచయం చేసింది. 
 
కలై స్నేహితురాలు ఆమె కంటే అందంగా వుండటంతో వినోద్ కుమార్, సూర్య ఆమెతో షికార్లు కొట్టడం ప్రారంభించారు. కలైని పక్కనబెట్టేశారు. స్నేహితురాలితో వినోద్, సూర్య జల్సా చేయడం.. తనతో తిరగకపోవడంతో ఆవేశానికి గురైన కలై వారిద్దరినీ నిలదీసింది. ఈ వ్యవహారం వాగ్వివాదానికి దారితీసింది. ఫలితంగా ఆగ్రహానికి గురైన వినోద్, సూర్య తప్పతాగి బీర్ బాటిల్‌తో కలై నెత్తిపై దాడి చేశారు. 
 
ఈ దాడిలో కలై తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. హత్య చేసిన అనంతరం కలై మృతదేహాన్ని అక్కడే ఇసుక మట్టిలో పూడ్చేసిన వినోద్, సూర్య పారిపోయారు. ఈ హత్యపై పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. పరారీలో వున్న వినోద్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వినోద్, సూర్య ఆటో డ్రైవర్లని విచారణలో తేలింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments