Webdunia - Bharat's app for daily news and videos

Install App

పని పూర్తి కాలేదో.. మూత్రాన్ని తాగించడం, బొద్దింకను తినిపించడం, టాయిలెట్‌ నీటిని..?

Webdunia
శుక్రవారం, 9 నవంబరు 2018 (18:50 IST)
నిర్ణీత సమయంలో పనిని పూర్తి చేయని కారణంగా ఓ చైనాకు చెందిన ప్రైవేట్ సంస్థ ఉద్యోగులకు చీదరించుకునే శిక్షలను అమలు చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన ఓ ఇంటీరియర్ డెకరేషన్ ఉత్పత్తులను తయారు చేసే సంస్థలో పనిచేసే ఉద్యోగులు టాయిలెట్ నీటిని తాగాలని కఠినశిక్ష విధించింది.
 
చైనా, కుయిసోహూ ప్రావిన్స్‌లోని ఓ ప్రైవేట్ సంస్థ.. నిర్ణీత సమయానికి పనులను పూర్తి చేయని ఉద్యోగులకు కఠిన శిక్ష విధిస్తోందని తెలిసింది. ఈ శిక్షలు దారుణంగా వుంటాయని వెల్లడి అయ్యింది. ఇందులో మూత్రాన్ని తాగించడం, ప్రాణాలతో వున్న బొద్దింకను తినేలా చేయడం.. టాయిలెట్ నీటిని తాగించడం వంటి దారుణమైన శిక్షలుంటాయని తేలింది. ఈ శిక్షలను తోటి ఉద్యోగుల ముందు నిలబెట్టి అమలు చేస్తారని.. అప్పుడే నిర్ణీత సమయానికి వారు పనిని పూర్తి చేస్తారని సదరు సంస్థ భావించేదని తెలిసింది.
 
ఈ వ్యవహారం.. ఆ సంస్థ నుంచి తప్పుకున్న ఉద్యోగులు వీడియో రూపంలో బయటపెట్టడం ద్వారా బహిర్గతం అయ్యింది. ఆధారాలతో పాటు పోలీసులకు ఫిర్యాదులు అందడంతో.. ఆ సదరు సంస్ధకు చెందిన ముగ్గురు మేనేజర్లను అరెస్ట్ చేసి.. రిమాండ్ తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments