Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రణయ్‌ని ప్రేమించానని బాబాయ్ కొడుకు నా చేయి పట్టుకుని... అమృత

ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న పాపానికి భర్తను పోగొట్టుకున్న అమృత ఇపుడు తన కుటుంబ సభ్యులు పెట్టిన వేధింపులను ఒక్కొక్కటిగా వెల్లడిస్తోంది. ముఖ్యంగా, తన బాబాయ్ శ్రవణ్, ఆయన కుమారుడు, పిన్ని పెట్టిన బ

Advertiesment
Pranay
, సోమవారం, 17 సెప్టెంబరు 2018 (09:13 IST)
ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న పాపానికి భర్తను పోగొట్టుకున్న అమృత ఇపుడు తన కుటుంబ సభ్యులు పెట్టిన వేధింపులను ఒక్కొక్కటిగా వెల్లడిస్తోంది. ముఖ్యంగా, తన బాబాయ్ శ్రవణ్, ఆయన కుమారుడు, పిన్ని పెట్టిన బాధలను వెల్లడించింది. తాను ప్రణయ్‌ను ప్రేమిస్తున్నానని తెలిసి బాబాయ్ కుమారుడు తనపట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడనీ ఆరోపించింది.
 
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య కేసులో ప్రధాన నిందితులను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒకరు యువతి తండ్రి మారుతిరావు కాగా, రెండో నిందితుడిగా ఆమె బాబాయ్ శ్రవణ్ ఉన్నాడు. ఈ నేపథ్యంలో తన తండ్రి, బాబాయ్‌ల గురించి అమృత సంచలన విషయాలను వెల్లడించింది. 
 
తన తండ్రి మాదిరే బాబాయ్ కూడా నేరప్రవృత్తి కలిగిన వ్యక్తి అని, ఆయనకు అనేక మంది మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని చెప్పింది. అలాగే, ఆయన కుమారుడు కూడా తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనీ, పలుమార్లు చేయిపట్టుకుని బలవంతం చేశాడనీ ఆరోపించింది. ఈ విషయాన్ని బాబాయ్‌కి చెబితే... అబ్బాయిలు అలాగే ఉంటారు, నీవు జాగ్రత్తగా ఉండాలి అని తనకే హితబోధ చేశాడని తెలిపింది. 
 
ఈ ఘటన జరిగినప్పుడు తాను బీటెక్ చదువుతున్నానని, బాబాయ్ కొడుకు 8వ తరగతి చదువుతున్నాడని చెప్పింది. బాబాయ్ కొడుకు పోర్న్ వీడియోలు చూస్తున్నాడని అతని తల్లికి చెబితే... వాటిని చూడకపోతే అబ్బాయి అని ఎలా అనిపించుకుంటాడు? అంటూ వెనకేసుకొచ్చిందని అమృత తెలిపింది. ఒక తల్లి ఇలాంటి వాటిని వెనకేసుకు రావడం సమంజసమేనా? అని ప్రశ్నించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రణయ్ పరువు హత్య.. ఉక్రెయిన్ నుంచి సోదరుడు.. వదినకు ఓదార్పు