Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్లి వీడియో కంటే ప్రణయ్ హత్య వీడియోకు లైక్స్ ఎక్కువ వస్తాయని?

అమృత ప్రణయ్‌ల ప్రేమ విషాదంగా ముగిసింది. ప్రణయ్ హత్య తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తోంది. కులహత్యగా ప్రణయ్ మరణం మిగిలిపోయింది. పక్కా ప్లాన్ ప్రకారం.. వేరు కులం అబ్బాయి ప్రణయ్‌ను అమృత తండ్రి, ఆమె బా

Advertiesment
Miryalaguda Murder Case
, ఆదివారం, 16 సెప్టెంబరు 2018 (12:53 IST)
అమృత ప్రణయ్‌ల ప్రేమ విషాదంగా ముగిసింది. ప్రణయ్ హత్య తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తోంది. కులహత్యగా ప్రణయ్ మరణం మిగిలిపోయింది. పక్కా ప్లాన్ ప్రకారం.. వేరు కులం అబ్బాయి ప్రణయ్‌ను అమృత తండ్రి, ఆమె బాబాయి కలిసి హత్య చేశారని సమాచారం. పరువు కోసం పగబట్టిన తండ్రి అనుక్షణం నిఘాపెట్టి, చివరికి అన్నంత పనిచేశాడు. ప్రేమిస్తే తప్పా.. అంటూ రోదిస్తున్న అమృత వర్షిణి వేదన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. 
 
ఫేస్‌బుక్‌లో అమృత పోస్ట్‌ చేసిన వీడియోనే హత్యకు ఉసిగొల్పి ఉంటుందని ప్రణయ్‌ బంధువు ఒకరు అనుమానం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పెళ్లి తర్వాత అమృత ఫేస్‌బుక్‌లో ఒక వీడియో పోస్ట్‌ చేసింది. ఈ వీడియో చూసిన ఆమె తండ్రి మారుతీరావు.. అమృతకు గట్టి వార్నింగ్ ఇచ్చాడని సమాచారం. ఈ పెళ్లి వీడియో కంటే.. ప్రణయ్‌ను హత్య చేసిన వీడియోకే ఎక్కువ హిట్స్ వస్తాయని.. అమృత హెచ్చరించినట్లు స్వయంగా అమృతనే ఆరోపించారు.
 
మొదట తాము కూడా పెళ్లికి నిరాకరించామని, అయితే ప్రణయ్‌ లేకపోతే చచ్చిపోతానని అమృత స్పష్టం చేయడంతో పెళ్లికి ఒప్పుకున్నామని ప్రణయ్‌ కుటుంబ సభ్యులు అంటున్నారు. అలాగే అమృత తల్లికాబోతోందని తెలిసి సంతోషించామని.. ఆగస్ట్ 17న రిసెప్షన్‌​ నిర్వహించినట్టు తెలిపారు. 
 
తాము భయపడినట్టుగానే ఎంతో ధైర్యవంతుడైన తమ కొడుకుని పొట్టనపెట్టుకున్నారని ప్రణయ్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. తన కుమారుడు ప్రణయ్, కోడలు అమృతలను చూసి చిలకాగోరింకల్లా ఉన్నారని అనేవారని ప్రణయ్ తల్లి ప్రేమలత రోదిస్తోంది. 
 
ప్రధాన నిందితుడు మారుతీ రావు వెనక చాలా మంది రాజకీయ నాయకులున్నారని ఆమె ఆరోపిస్తోంది. మారుతీరావు కూతురికి తన కుమారుడి కన్నా మంచి భర్త దొరుకుతాడా, వాళ్ల కులంలో ఇంత మంచి వరుడు దొరుకుతాడా అని ఆమె ప్రశ్నించింది. మారుతీరావుకు తన కుమారుడి ఉసురు తగులుతుందని, మారుతీరావు కుటుంబం సర్వ నాశనం అవుతుందని శాపనార్థాలు పెట్టింది. కిరసనాయిల్ అమ్ముకునే మారుతీరావు భూములు కబ్జా చేసి సంపాదించాడని ఆమె ఆరోపించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెరుగుతున్న పెట్రోల్ ధరలు- ఆల్ టైమ్ రికార్డ్.. సామాన్యుడికి చుక్కలు