Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త వేధింపులు అంతా ఇంతా కాదు.. కాపాడండి.. ట్విట్టర్ వీడియోలో మహిళ

భర్తతో చిత్రహింసలు భరించలేకపోతున్నానని ఓ మహిళ ట్విట్టర్ వీడియో ద్వారా పోలీసులను వేడుకుంది. తన భర్త తనను హింసిస్తున్నాడని.. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ తంతు జరుగుతుందని.. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లే

Webdunia
సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (11:57 IST)
భర్తతో చిత్రహింసలు భరించలేకపోతున్నానని ఓ మహిళ ట్విట్టర్ వీడియో ద్వారా పోలీసులను వేడుకుంది. తన భర్త తనను హింసిస్తున్నాడని.. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ తంతు జరుగుతుందని.. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని చెప్పింది. తన భర్తకు అమ్మాయిల పిచ్చి ఎక్కువని, అప్పుల పాలయ్యాడని, మరో మహిళతో వివాహేత సంబంధం వుంది.
 
ఈ అవలక్షణాల వల్లే తాను తన కుమార్తెతో కలిసి ఆయనకు దూరంగా ఉంటున్నానని.. అయినప్పటికీ ఇంటికొచ్చి గొడవ చేయడం.. ఇంట్లోని వస్తువులను దొంగలించడం, తన పేరు మీదున్న ఫ్లాటును అతని పేరు మీద రాయాలంటూ వేధిస్తున్నాడని చెప్పుకొచ్చింది. అది కుదరదనే సరికి కత్తితో దాడి చేశాడని చెప్పింది. 
 
వివరాల్లోకి వెళితే.. ముంబై కమీషనరేట్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గుర్‌ప్రీత్‌ సింగ్‌ అనే వ్యాపారవేత్త తన భార్య, ముగ్గురు పిల్లలతో ఖర్‌ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నాడు. కొన్నేళ్ల క్రితం భార్య, భర్తలిద్దరికీ మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఇక అప్పటి నుంచి వేర్వేరు అపార్ట్‌మెంట్లతో వుంటున్నారు గుర్ ప్రీత్ దంపతులు. 
 
ఈ క్రమంలో ఓ రోజు భార్య ఉంటున్న ఫ్లాట్‌లో దొంగతనానికి యత్నించిన గుర్‌ప్రీత్‌, శనివారం ఏకంగా ఆమెపై దాడికి యత్నించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

నరేష్ అగస్త్య కొత్త చిత్రం మేఘాలు చెప్పిన ప్రేమ కథ

స్క్రిప్ట్, దర్శకుడి ని బట్టి సినిమాలు అంగీకరిస్తున్నా : కామాక్షి భాస్కర్ల

హీరోయిన్ రష్మిక మందన్నా ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

విక్రమ్ కొత్త చిత్రం విడుదలకు ఉన్న చిక్కులేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments