Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముంబై ఎయిర్‌పోర్ట్ కొత్త రికార్డు.. 24 గంటల్లో 980 విమానాలు టేకాఫ్

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం తన రికార్డును తనే తిరగరాసింది. ప్రపంచంలోనే అత్యంత రద్దీతో కూడిన ఏకైక రన్‌ వే విమానాశ్రయంగా గుర్తింపు తెచ్చుకున్న ముంబై ఎయిర్‌పోర్ట్ .. జనవరి 20న 24 గంటల వ్యవధిలో 980 విమాన

Advertiesment
ముంబై ఎయిర్‌పోర్ట్ కొత్త రికార్డు.. 24 గంటల్లో 980 విమానాలు టేకాఫ్
, ఆదివారం, 4 ఫిబ్రవరి 2018 (13:24 IST)
ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం తన రికార్డును తనే తిరగరాసింది. ప్రపంచంలోనే అత్యంత రద్దీతో కూడిన ఏకైక రన్‌ వే విమానాశ్రయంగా గుర్తింపు తెచ్చుకున్న ముంబై ఎయిర్‌పోర్ట్ .. జనవరి 20న 24 గంటల వ్యవధిలో 980 విమానాలు ఇక్కడి రన్‌వే పై ల్యాండింగ్, టేకాఫ్‌లతో రాకపోకలు కొనసాగించాయి.
 
అంతకుముందు డిసెంబర్ ఆరో తేదీన 974 విమానాల రాకపోకలతో నమోదైన రికార్డును ముంబై ప్రస్తుతం తిరగరాసింది. తద్వారా ప్రపంచంలోనే అత్యంత రద్దీతో కూడిన విమానాశ్రయంగా ముంబై నిలిచింది. తర్వాతి స్థానంలో బ్రిటన్‌లోని గట్విక్ విమానాశ్రయం నిలిచింది.
 
గట్విక్ విమానాశ్రయ సామర్థ్యం ఎక్కువైనా.. రోజులో ఉదయం ఐదు గంటల నుంచి అర్థరాత్రి 12 గంటల వరకే విమానాల రాకపోకలుంటాయి. అయితే ముంబై ఎయిర్ పోర్ట్ 24 గంటలు తెరిచే వుంటుందని.. ఇందులో మౌలిక సదుపాయాలు మెరుగ్గా వుంటాయని.. రన్ వే, మెయిన్ రన్ వే, స్మాలర్ సెకండరీ రన్ వంటివి ఏర్పాటు చేయడం ద్వారా విమాన రాకపోకలకు అనువుగా వుంటాయని ముంబై ఎయిర్ పోర్ట్ విమానాశ్రయ అధికారులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కట్టుబట్టలతో మనల్ని బయటకు గెంటేశారు: నారా లోకేశ్