Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఛాన్సిస్తామనీ టీవీ నటిని వ్యభిచారం రొంపిలోకి దించారు...

సినీ మోజులో పడి అనేక మంది అమ్మాయిలు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా, మధ్యవర్తులను నమ్మి మోసపోవడమే కాకుండా, చివరకు తన శీలాన్ని కూడా పోగొట్టుకుంటున్నారు.

ఛాన్సిస్తామనీ టీవీ నటిని వ్యభిచారం రొంపిలోకి దించారు...
, గురువారం, 1 ఫిబ్రవరి 2018 (08:43 IST)
సినీ మోజులో పడి అనేక మంది అమ్మాయిలు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా, మధ్యవర్తులను నమ్మి మోసపోవడమే కాకుండా, చివరకు తన శీలాన్ని కూడా పోగొట్టుకుంటున్నారు. తాజా, ఓ వ్యక్తి బుల్లితెర నటిని వ్యభిచార రొంపిలోకి దించాడు. వెండితెరపై అవకాశం కల్పిస్తామని చెప్పి మోసం చేశాడు. ఫలితంగా సెక్స్ రాకెట్‌లో కూరుకునిపోయింది. ముంబైలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ముంబై నగరంలోని మలాద్ ప్రాంతంలో ఓ టీవీ నటితో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నట్టు స్థానిక పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో మఫ్టీలో వెళ్లిన పోలీసులకు వ్యభిచారం కేంద్రం నుంచి ఆ నటిని కాపాడారు. అలాగే, ఆమెను వ్యభిచారంలోకి దించిన మధ్యవర్తి ఆసిఫ్ దొరాజీవాలా, విటుడు జె.రాథోడ్‌లను కూడా పోలీసులు అరెస్టు చేశారు. 
 
ఆసిఫ్ దొరాజీవాలాకు ముంబై నగరంలో చిత్ర నిర్మాణ సంస్థ ఉందనీ, ఆ సంస్థ ద్వారా సినిమాలా నటించే అవకాశం కల్పిస్తామని చెప్పి ఆ నటిని లోబరుచుకుని, బలవంతంగా సెక్స్‌రాకెట్‌లో దించినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. విటులు వాట్సాప్ ద్వారా ఈ సెక్స్‌రాకెట్‌ను సంప్రదిస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. టీవీ నటిని మహిళా సదనానికి తరలించి, నిందితులను రిమాండుకు తరలించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేడు 2018-19 వార్షిక బడ్జెట్.. జైట్లీ ముందు అనేక సవాళ్లు