Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాతో నిశ్చితార్థం చేసుకుని వేరొకడితో సన్నిహితంగా వుంటోంది.... అందుకే చంపేశా

హయత్ నగర్‌లో యువతి దారుణ హత్య కేసులో కాబోయే భర్త ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు తేలడంతో అతడిని శనివారం నాడు పోలీసులు అరెస్టు చేశారు. త్వరలో పెళ్లాడాల్సిన అనూషను ఎందుకు హత్య చేశావని ఆరా తీయగా... తనతో పెళ్లికి అంగీకరించి మరొకరితో సన్నిహితంగా వుంటోందనీ, దాన్

Advertiesment
నాతో నిశ్చితార్థం చేసుకుని వేరొకడితో సన్నిహితంగా వుంటోంది.... అందుకే చంపేశా
, శనివారం, 3 ఫిబ్రవరి 2018 (14:17 IST)
హయత్ నగర్‌లో యువతి దారుణ హత్య కేసులో కాబోయే భర్త ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు తేలడంతో అతడిని శనివారం నాడు పోలీసులు అరెస్టు చేశారు. త్వరలో పెళ్లాడాల్సిన అనూషను ఎందుకు హత్య చేశావని ఆరా తీయగా... తనతో పెళ్లికి అంగీకరించి మరొకరితో సన్నిహితంగా వుంటోందనీ, దాన్ని చూసి తట్టుకోలేక హత్య చేసినట్లు నిందితుడు చెప్పినట్లు సమాచారం. కాగా అనూష గత నెల 30వ తేదీన హయత్ నగర్లోని తన అక్కా,బావల ఇంట్లో హత్యకు గురైన సంగతి తెలిసిందే.
 
నల్గొండ జిల్లా దేవరకొండ మండలం గిరిజనగర్‌ తండాకు చెందిన 25 ఏళ్ల అనూష బీటెక్‌ పూర్తిచేసి నగరంలో కానిస్టేబుల్ ప్రవేశ పరీక్ష కోసం శిక్షణ తీసుకుంటోంది. ఈ క్రమంలో ఆమెకు నాలుగు నెలల క్రితం శంషాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న మోతీలాల్‌తో సంబంధం కుదిర్చారు. అలా ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణలు నడుస్తున్నాయి. గత నెల 25న ఓ ఉద్యోగానికి ఇంటర్వ్యూ కోసం హాజరు కావాల్సి వుందని, రావాల్సిందిగా అడగడంతో ఆమె వంటరిగానే నగరానికి వచ్చింది. ఐతే నాలుగైదు రోజుల తర్వాత ఆమెను హయత్ నగర్లోని ఆమె నివాసముంటున్న ఇంట్లోనే అత్యంత దారుణంగా బండ రాయితో మోది హత్య చేశాడు మోతీలాల్. దీనికి కారణం... ఆమె మరొకరితో సన్నిహితంగా వుండటమేనంటూ తెలిపాడు. ఆమెను హత్య చేసింది ఎవరన్నది తొలుత తెలియరాలేదు. కానీ ఆ తర్వాత పోలీసుల దర్యాప్తులో కట్టుకోబోయేవాడే కాలయముడయ్యాడని తేలింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనంతలో ప్రత్యేక హోదా ఉద్యమం : రోడ్డుపైనే విద్యార్థుల వంటా-వార్పు.. వైకాపా మద్దతు