Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేకప్‌ గదిలో జూ.ఆర్టిస్టుపై అత్యాచారం... టీవీ నిర్మాతకు జైలుశిక్ష

మేకప్ గదిలో జూనియర్ ఆర్టిస్టుపై అత్యాచారం చేసిన కేసు బుల్లితెర నిర్మాతకు జైలుశిక్ష విధిస్తూ ముంబై ప్రత్యేక మహిళా కోర్టు తీర్పునువెలువరించింది. తాజాగా వెలువడిన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే...

Webdunia
శుక్రవారం, 27 జులై 2018 (11:50 IST)
మేకప్ గదిలో జూనియర్ ఆర్టిస్టుపై అత్యాచారం చేసిన కేసు బుల్లితెర నిర్మాతకు జైలుశిక్ష విధిస్తూ ముంబై ప్రత్యేక మహిళా కోర్టు తీర్పునువెలువరించింది. తాజాగా వెలువడిన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే...
 
ముంబైకు చెందిన ముకేశ్ మిశ్రా (33) అనే వ్యక్తి గత 2012 సంవత్సరంలో 'ఏక్ వీర్ కీ అరదాస్ వీర్' అనే టీవీ షోకు నిర్మాతగా ఉన్నారు. ఈ షోలో ఓ జూనియర్ ఆర్టిస్ట్ నటించింది. ఈమె వయసు 33 యేళ్లు. అయితే, ఉదయాన్నే షూటింగ్ ఉందని, తక్షణం షూటింగ్ స్పాట్‌కు రావాలంటూ కబురు పెట్టాడు. 
 
దీంతో ఆమె ఆదరాబాదరాగా బస్టాపుకు చేరుకోగా, అప్పటికే అక్కడ వేచివున్న ముకేశ్.. బస్సులో వెళితే లేట్ అవుతుందని చెప్పి తన బైక్ ఎక్కించుకుని తీసుకెళ్లాడు. షూటింగ్ స్పాట్‌లోని మేకప్ రూముకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. విషయం ఎవరికైనా చెబితే కూతురిని చంపేస్తానని బెదిరించాడు. ఆపై పలుమార్లు ఇదేవిధంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
అతని వేధింపులు తాళలేకపోయిన బాధితురాలు, 2013లో భర్త సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు విచారణ ముంబై ప్రత్యేక మహిళా కోర్టులో ఐదేళ్లపాటు సాగింది. ఈ విచారణలో ముకేశ్ దోషేనని న్యాయస్థానం తేల్చి, ఏడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.5 వేల అపరాధం విధిస్తూ తీర్పునిచ్చింది. 

సంబంధిత వార్తలు

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

ప్రేమ కథతో పాటుగా మర్డర్, క్రైమ్ మిస్టరీ చిత్రమే నింద టీజర్ : నవీన్ చంద్ర

ఫ్యాన్స్ షాక్: కుడిచేతికి కట్టు వేసుకుని కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌కి ఐశ్వర్యా రాయ్ - video

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments