Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వామ్మో.. ముంబైలో అతిపెద్ద నాగుపాము... 5.5 అడుగుల పొడవు..

అతిపెద్ద నాగుపాము ముంబైలో కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. కల్యాణ్‌ ప్రాంతంలోని గోద్రేజ్‌ హిల్‌ పరిసరాల్లో ఉన్న శనీశ్వరుడి మందిరం వెనకాల శనివారం జూలై-21 పొడువైన తాచు పాము కలకలం సృష్టించింది. ప

Advertiesment
వామ్మో.. ముంబైలో అతిపెద్ద నాగుపాము... 5.5 అడుగుల పొడవు..
, ఆదివారం, 22 జులై 2018 (13:42 IST)
అతిపెద్ద నాగుపాము ముంబైలో కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. కల్యాణ్‌ ప్రాంతంలోని గోద్రేజ్‌ హిల్‌ పరిసరాల్లో ఉన్న శనీశ్వరుడి మందిరం వెనకాల శనివారం జూలై-21 పొడువైన తాచు పాము కలకలం సృష్టించింది. ప్రతి శనివారం ఈ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఉదయం పూట భక్తులు మందిరం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా నాగుపామును చూసి భయాందోళనకు గురయ్యారు. 
 
వారి అరుపులతో పాము మందిరంలోని గార్డెన్‌లోకి చొరబడింది. సాక్షాత్తు భగవంతుడే కనిపించాడంటూ కొంతమంది భక్తులు పూజలు, భజనలు చేశారు. కేతన్‌ పాటిల్‌ అనే యువకుడు సర్పమిత్ర దత్తా బెంబేకు సమాచారమివ్వడంతో ఆయన వచ్చి పామును పట్టుకుని సంచిలో బంధించారు.
 
5.5 అడుగుల పొడవున్న ఈ పాము భారతీయ జాతికి చెందినదిగా గుర్తించారు. తాచు పామును అటవీ ప్రాంతంలో విడిచిపెట్టనున్నట్లు దత్తా తెలిపారు. అయితే పాము మందిరంలో ఎప్పటినుంచో ఉన్నట్లు శబ్దాలు వచ్చేవని.. ఇప్పటివరకు ఎవ్వరికీ హానీ చేయలేదని పూజారులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అలాంటి పార్టీతో ఎవరైనా పొత్తు పెట్టుకుంటారా? టీడీపీ వెనక్కి తిరిగి చూసుకోవాలి?: జనసేనాని