Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిజాబ్ వేసుకోలేదని భార్యను కిరాతకంగా చంపేశాడు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 28 సెప్టెంబరు 2022 (13:08 IST)
హిజాబ్ వేసుకోలేదని భార్యను కిరాతకంగా చంపేశాడు.. ఓ వ్యక్తి. ఇస్లాం సంప్రదాయాల్ని పాటించడానికి భార్య అంగీకరించలేదు. దీంతో తీవ్ర కోపానికి గురైన ఆ వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు. నిజానికి ఈ బుర్ఖా విషయం మీదే గొడవై కొద్ది రోజుల క్రితమే వీరు విడిపోయారు. అయితే తాజాగా విడాకులకు సంబంధించిన విషయమై కలుసుకుని మాట్లాడుకునే సందర్భంలో ఇది జరిగింది.
 
వివరాల్లోకి వెళితే.. నిందితుడు ఇక్బాల్ షైక్(36). టాక్సీ నడుపుతుంటాడు. బాధితురాలి పేరు రూపాలి(20). ఈమె హిందూ మహిళ. 2019లో ఇక్బాల్‭ను వివాహం చేసుకున్న అనంతరం జరాగా పేరు మార్చుకుంది. 2020లో వీరికి ఒక కుమారుడు పుట్టాడు. ముంబైలో నివాసం ఉంటారు. కాగా రూపాలి బుర్ఖా ధరించాలంటూ ఇక్బాల్ కుటుంబం ఒత్తిడి తీసుకువచ్చింది. ఇక్బాల్ సైతం ఈ విషయంలో మొండిగా వ్యవహరించడంతో కొద్ది రోజుల క్రితమే వీరు విడిపోయారు.
 
కాగా, తనకు విడాకులు కావాలని రూపాలి డిమాండ్ చేస్తుండడంతో ఈ విషయమై చర్చించడానికి వీరు కలుసుకున్నారు. కానీ గొడవ మళ్లీ మొదలైంది. బుర్ఖా ధరించాల్సిందేనని నిందితుడు పట్టుబట్టాడు. అందుకు మృతురాలు అంగీకరించలేదు. దీంతో ఆవేశానికి గురైన అతను కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె మృతి చెందింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఇక్బాన్‭ను అరెస్ట్ చేసి 302 కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments