Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాబోయే భార్య నగ్నచిత్రాలు ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన వైద్యుడు.. ఎక్కడ?

Advertiesment
murder
, బుధవారం, 21 సెప్టెంబరు 2022 (10:04 IST)
తాను పెళ్లి చేసుకోబోయే యువతి నగ్న ఫోటోలను ఓ వైద్యుడు ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ యువతి తన స్నేహితులతో వచ్చి దేహశుద్ధి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వైద్యుడు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ, మూడు రోజు తర్వాత మృతి చెందాడు. బెంగుళూరులో ఈ ఘటన జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, వారం రోజుల క్రితం బెంగుళూరులో వికాస్ రాజన్ అనే యువ డాక్టర్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలయ్యాడు. ఆ తర్వాత కోమాలోకి వెళ్లిపోయాడు. మూడురోజుల చికిత్స తర్వాత ప్రాణాలు విడిచాడు. అయితే అతని శరీరంపై బలమైన దెబ్బలు కనిపిస్తుండడంతో పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేసే సరికి అసలు విషయాలు వెల్లడయ్యాయి.
 
వికాస్ రాజన్ ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. చెన్నైలో ఓ ఆసుపత్రిలో కొంతకాలంగా పనిచేశాడు. అనంతరం బెంగళూరు వచ్చి, విదేశాల్లో వైద్య విద్య అభ్యసించాలనుకునే ఔత్సాహికులకు శిక్షణ ఇవ్వడాన్ని ఉపాధిగా ఎంచుకున్నాడు.
 
రెండేళ్ల కిందట డాక్టర్ వికాస్ రాజన్‌కు ప్రతిభ అనే ఆర్కిటెక్ట్ సోషల్ మీడియాలో పరిచయమైంది. ఇద్దరూ కొంతకాలం సహజీవనం చేశారు. వారి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించాయి. 
 
అయితే, ఇటీవల తన నగ్న చిత్రాలు ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి ప్రతిభ దిగ్భ్రాంతికి గురైంది. దాంతో వికాస్ రాజన్‌ను నిలదీసేసరికి అతడు అసలు విషయం చెప్పాడు. ఓ ఫేక్ ఐడీ రూపొందించి, కేవలం సరదా కోసమే ఆ నగ్న ఫొటోలు పోస్టు చేశానని తెలిపాడు. 
 
దాంతో అతడిపై తీవ్ర ఆగ్రహం చెందిన ప్రతిభ... ఓ పార్టీ ఉందంటూ తన స్నేహితుల వద్దకు తీసుకెళ్లింది. అక్కడ మద్యం సేవించిన అనంతరం ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ప్రతిభ, ఆమె స్నేహితులు డాక్టర్ వికాస్ రాజన్‌పై దాడి చేశారు. కర్రలతో దాడి చేశారు. 
 
తీవ్ర గాయాలపాలైన అతడిని ప్రతిభ ఆసుపత్రికి తరలించింది. ఓ దాడిలో రాజన్ గాయపడ్డాడని ఆ యువ డాక్టర్ సోదరుడు విజయ్‌కి చెప్పింది. ఆ ప్రకారమే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఎక్కడా తన పాత్ర ఉందన్న విషయాన్ని ఆమె బయటపెట్టలేదు. 
 
అయితే, పోలీసులు మరింత నిశితంగా దర్యాప్తు చేయగా, అసలు నిందితురాలు ప్రతిభేనని తేలింది. ఆమెను, ఆమెకు సహకరించిన గౌతమ్, సుశీల్, సునీల్ అనే ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరుపర్చగా, జ్యుడిషియల్ కస్టడీ విధించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అవినీతి ఉచ్చులో చిక్కుకున్న"బుల్లెట్ బండి" వరుడు