భార్యకు విడాకులు.. గర్ల్‌ఫ్రెండ్‌కు అబార్షన్.. ఇంకో గర్ల్‌ఫ్రెండ్ వద్ద డబ్బులు గుంజేశాడు..

Webdunia
మంగళవారం, 25 డిశెంబరు 2018 (10:35 IST)
మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. భార్యను విడాకులతో వదిలించుకున్నాడు. ఆపై గర్ల్‌ఫ్రెండ్‌తో చనువుగా వున్నాడు. ఆమెను గర్భవతిని చేశాడు. చివరికి ఆమెకు అబార్షన్ చేయాలనుకున్నాడు. ఇక గతిలేక ఇంకో గర్ల్ ఫ్రెండ్ దగ్గర డబ్బులు తీసుకున్నాడు. చివరికి పోలీసులకు చిక్కుకున్నాడు.


ముంబైలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 23 ఏళ్ల అశ్విన్ పాండే అనే వ్యక్తి భార్యతో మనస్పర్థల కారణంగా విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ క్రమంలో 30 ఏళ్ల మహిళతో పరిచయం పెంచుకున్నాడు. 
 
ఇటీవలే ఆమె ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలో మేనేజర్‌గా చేరింది. ఆమెను ఇంప్రెస్ చేసే ఉద్దేశంతో తాను ఓ ఎయిర్‌లైన్ కంపెనీలో సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్‌గా చేరినట్టు చెప్పి.. ఆమెను బుట్టలో వేసుకున్నాడు. ఆపై డబ్బులు గుంజడం మొదలుపెట్టాడు. తనకు బాగా దగ్గరి బంధువు ఒకరు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డానని చెప్పి.. అనేక దఫాలుగా ఆమె నుంచి రూ.6.5లక్షలు తీసుకున్నాడు. 
 
ఈ క్రమంలో ఓ రోజు పాండే ఫోన్‌లో ఓ మెసేజ్ చూసిన ఆమెకు అనుమానం వచ్చింది. ‘ఐ లవ్ యూ’ అని రాసి ఉన్న మెసేజ్‌ను చదివిన ఆమె పాండేను అనుమానించింది. ఆ ఫోన్ నెంబర్‌కు ఫోన్ చేయడంతో అసలు సంగతి బయటపడింది. తన గర్ల్ ఫ్రెండ్ కోసమే అశ్విన్ తన వద్ద డబ్బు గుంజాడని తెలుసుకుంది. 
 
అబార్షన్ కోసం వచ్చిన మహిళ, డబ్బులిచ్చిన మోసపోయిన ఇద్దరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు అత్యాచారం, మోసం కేసు నమోదు చేసి, అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments