Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెల్లి అని పిలిచాడు.. భార్యతో ప్లాన్ చేసి రేప్ చేశాడు...

Webdunia
సోమవారం, 24 డిశెంబరు 2018 (21:06 IST)
విశాఖపట్నంలోని గాజువాక సమీప ప్రాంతంలోని గాంధీనగర్ అది. రమేష్, రజితలు ఇద్దరు భార్యాభర్తలు. రమేష్‌ స్థానికంగా ఉన్న ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరికి పిల్లలు లేరు. అయితే ఆర్థికంగా ఇబ్బందులు మాత్రం ఎక్కువే. రమేష్‌ సంపాదించే జీతం సరిపోకపోవడంతో ఇబ్బందులు పడేవారు భార్యాభర్తలు.
 
రమేష్, రజితలు నివాసముంటున్న ఇంటి పక్కనే మల్లీశ్వరి అనే యువతి ఉండేది. ఈమె సాఫ్ట్వేర్ ఇంజనీర్. నెలకు లక్ష రూపాయలకు పైగానే జీతం. ఇంటి పక్కనే కావడంతో రజిత, మల్లీశ్వరిలు ఫ్రెండ్సయ్యారు. మల్లీశ్వరి కుటుంబ నేపథ్యం మొత్తం రజితకు తెలుసు. రజిత ఆ విషయాలన్నింటిని భర్త రమేష్‌తో షేర్ చేసుకునేది. 
 
అయితే ఒకరోజు భార్యాభర్తలిద్దరికీ ఒక ఐడియా వచ్చింది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలంటే మల్లీశ్వరిని బ్లాక్‌మెయిల్ చేయాలని నిర్ణయించుకున్నారు. రమేష్, రంజితకు ఒక ఐడియా చెప్పాడు. నీ పుట్టినరోజు అని చెప్పి మల్లీశ్వరిని ఇంటికి పిలిచి కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇస్తే ఆమె అపస్మారకంలోకి వెళ్లాక ఆమెపై అత్యాచారం చేస్తాను. ఆ తరువాత ఆమెను బ్లాక్ మెయిల్ చేసి ఆమె జీతంలో సగం డబ్బులు ప్రతినెలా తీసుకుందామని చెప్పాడు.
 
ఆర్థిక ఇబ్బందుల్లో నిండా మునిగిన రజిత తన భర్త ఐడియాకు ఓకే చెప్పింది. రజితతో కలిసి ఉన్నంతవరకు మల్లీశ్వరిని చెల్లి అని పిలిచిన రమేష్ పశువుగా మారిపోయాడు. అనుకున్నట్లుగా మల్లీశ్వరికి మత్తు మందు కలిపి ఇచ్చి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తరువాత స్పృహలోకి వచ్చిన మల్లీశ్వరిని భార్యాభర్తలిద్దరూ కలిసి బెదిరించారు. దీంతో మల్లీశ్వరి రెండురోజుల పాటు నిద్రాహారాలు మాని ఆలోచనలో పడింది. తనకు జరిగిన అన్యాయాన్ని ధైర్యం చేసి షీ టీంకు చెప్పింది మల్లీశ్వరి. షీం టీం పోలీసులు రంగంలోకి దిగి భార్యాభర్తలిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రత్యేకమైన రోజుగా మార్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు : ఉపాసన

భర్తను పరిచయం చేసిన నటి అభినయ!!

కసికా కపూర్... చాలా కసి కసిగా వుంది: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (video)

Prabhas: వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి.. ఎంతవరకు నిజం?

కథలకు, కొత్త టాలెంట్ ని కోసమే కథాసుధ గొప్ప వేదిక: కే రాఘవేంద్రరావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments