Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమార్తెతో సంబంధం.. యువకుడిని చిత్ర హింసలు పెట్టిన తండ్రి.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 27 జనవరి 2021 (12:42 IST)
మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలో దారుణం జరిగింది. తన కుమార్తెతో సంబంధాన్ని కలిగి ఉన్నాడన్న అక్కసుతో యువతి తండ్రి దారుణానికి ఒడిగట్టారు. యువకుడి మర్మాంగాలపై దాడిచేసి చిత్రహింసలకు గురి చేశారు. 
 
వివరాల్లోకి వెళ్తే ముంబైలో ఓ యువతితో 18 ఏళ్ల ఓవైస్ అబ్దుల్ రహీం ఖాన్ అనే యువకుడు సన్నిహితంగా ఉంటున్నాడు. అయితే తన కుమార్తెకు దూరంగా ఉండాలని తండ్రి పలుమార్లు హెచ్చరించాడు. అయినా ఆ యువకుడు మాత్రం ఆ యువతిని వదల్లేదు. దీంతో యువతి తండ్రి 30 మందితో కలిసి యువకుడిపై దాడికి పాల్పడ్డాడు.
 
యువకుడి రహస్య భాగాలపై కత్తి, రాడ్‌లతో దాడి చేశాడు. ఆ తర్వాత కొండపై నుంచి నెట్టివేశారు. ఆ తర్వాత కోలుకున్న ఓవైస్ అబ్దుల్ రహీం ఖాన్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. జనవరి 23న జరిగిన ఈ ఘటన తర్వాత ప్రాణాలతో బయటపడినట్లు చెప్పుకొచ్చాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు యువతి తండ్రే ఈ కేసులో ప్రధాన నిందితుడని పోలీసులు తెలిపారు. 
 
తన కుమార్తెతో కలిసి ఉండకూడదని.. సంబంధం కొనసాగించొద్దని ఎన్నోసార్లు హెచ్చరించినప్పటికీ యువకుడు పట్టించుకోలేదని పోలీసులు తెలిపారు. అందువల్లే దాడి జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 30మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments