Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్సులో చార్జింగ్ పోర్ట్‌ లేదనీ.. 5 వేల ఫైన్‌........

Webdunia
మంగళవారం, 3 డిశెంబరు 2019 (16:35 IST)
యాడ్స్​లో చూపిన విధంగా బస్సులో ఎయిర్​కండిషనింగ్, మొబైల్​ చార్జింగ్​ పాయింట్​లేకపోవడంతో పాసింజర్​కు రూ.5 వేల ఫైన్‌‌ కట్టాలని మహారాష్ట్ర ఆర్టీసీని ఓ కన్స్యూమర్​ కోర్టు ఆదేశించింది. సతీష్​ రతన్ ​లాల్​ దయామా తన ఫ్రెండ్​తో కలిసి శివ్​షాహి బస్​లో జల్నా నుంచి ఔరంగాబాద్​కు జూలై 12న బయలుదేరాడు. మొబైల్​ బ్యాటరీ అయిపోవడంతో బస్సులో చార్జింగ్​ పాయింట్​ కోసం అడిగాడు. అయితే బస్సులో ఏసీ, చార్జింగ్​ పాయింట్​ పని చేయడం లేదని చెప్పారు. 
 
కంప్లయింట్​ రిజిస్టర్​ను ఇవ్వాలని బస్​ డ్రైవర్, కండక్టర్​ను అడిగితే ఇవ్వలేదు. దీంతో అతడు జిల్లా కన్స్యూమర్​ డిస్ప్యూట్​ రిడ్రెసల్​ ఫోరంలో కంప్లయింట్​ చేశాడు. ఏసీ, చార్జింగ్​ పాయింట్​ లేకపోవడంతో ఇబ్బందులకు గురయ్యానని, మెంటల్​ టెన్షన్​ అనుభవించానని అందులో పేర్కొన్నాడు. మహారాష్ట్ర ఆర్టీసీ తమ యాడ్స్​లో ఏసీ, మొబైల్​ చార్జింగ్ ​పోర్ట్​ గురించి ప్రచారం చేశాయని, టికెట్​లను కూడా అందుకు తగ్గట్టే చార్జ్​ చేశారని, అయితే బస్సులో ఆ రెండు సదుపాయాలు లేవని తెలిపాడు. వాదనలు విన్న జల్నా జిల్లా కన్స్యూమర్​ కోర్టు.. 30 రోజుల్లో సతీష్​కు రూ.5 వేల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments