Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ద్యావుడా... స్లిప్పర్లు వేసుకుంటే వెయ్యి, లుంగి కడితే రూ.2 వేలు ఫైన్

ద్యావుడా... స్లిప్పర్లు వేసుకుంటే వెయ్యి, లుంగి కడితే రూ.2 వేలు ఫైన్
, మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (15:07 IST)
ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారులపై భారీగా జరిమానాలు విధించేలా కేంద్ర  ప్రభుత్వం కొత్తగా  మోటారు వాహనాల చట్టం తీసుకొచ్చింది. దీంతో రూల్స్ పాటించని వాహనదారుల నుంచి ట్రాఫిక్ పోలీసులు భారీగా చలానాలు వసూలు చేస్తున్నారు.

ప్రస్తుత నిబంధనలకు మరికొన్ని రూల్స్ ను ఈ కొత్త చట్టంలో పొందుపరిచారు అధికారులు. కొత్త రూల్ ప్రకారం  టూ-వీలర్స్ నడిపేటప్పుడు వాహనదారులు స్లిప్పర్స్ వంటివి వాడకూడదు. ఈ రూల్‌ను నిర్లక్ష్యం చేసి చెప్పులేసుకుని డ్రైవింగ్ చేస్తే.. వెయ్యి రూపాయలు ఫైన్ కట్టాల్సిందే. మొదటిసారి చెప్పుల్లేకుండా డ్రైవింగ్ చేస్తే వెయ్యి రూపాయలు.. అదే రెండో సారి కూడా చేస్తే 15రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాల్సిందే.

ఇక ఉత్తర ప్రదేశ్ లో మరో కొత్త రూల్ ను అమలులోకి తెచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. లారీ డ్రైవర్లు లుంగీ ధరించి లారీ డ్రైవింగ్ చేస్తే భారీ జరిమానా చెల్సించాలి. లారీ డ్రైవర్లు లుంగీతో డ్రైవింగ్ చేస్తే రూ. రెండు వేల జరిమానా విధించాలని నిర్ణయించారు. ఈ కొత్త నిబంధనలు తెలుగు రాష్ట్రాలలోనూ త్వరలో అమలయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
 
హెల్మెట్ లేకుండా డ్రైవింగ్.. అడిగితే బూతులు తిట్టాడు. కొత్త మోటార్ వాహనాల చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత డ్రైవింగ్ విషయంలో అజాగ్రత్తగా ఉన్న వారికి జరిమానాల మోత మోగుతోంది. ట్రాఫిక్ రూల్స్‌ను పాటించకుండా.., డ్రైవింగ్ చేసే సమయంలో వాహనాలకు చెందిన కీలక పత్రాలను తీసుకెళ్లని సాధారణ పౌరులకి పోలీసులు చలాన్లు వేస్తున్నారు.

ఒకవేళ పోలీసులే ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే…? బీహార్ లోని బుక్సార్‌లో ఇలాంటి సంఘటనే జరిగింది. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్న పోలీస్‌ను ఓ యువకుడు ప్రశ్నించినందకు అతడిని అసభ్య పదజాలంతో దూషించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
బుక్సార్ లోని శిక్షాక్ కాలనీలో నివసిస్తున్న కమల్ కుమార్ అనే యువకుడు శనివారం రోజున డ్రైవింగ్ చేసే సమయంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లఘించాడు. దీంతో రోషన్ కుమార్ అనే పోలీస్ కమల్ కు రూ .11,000 జరిమానా విధించారు. చేసేదేమిలేక కమల్ ఆ జరిమానాను కట్టాడు.
 
ఇది జరిగిన తర్వాతి రోజే హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్న సదరు పోలీస్‌ను గమనించిన ఆ యువకుడు.. అతన్ని అడ్డుకొని ప్రశ్నించాడు. పోలీసులై వుండి మీరే రూల్స్‌ను అతిక్రమిస్తారా? మీకొక న్యాయం.. సాధారణ ప్రజలకో న్యాయమా ? అంటూ అతను  ప్రశ్నించేసరికి ఆ పోలీసుకు చిర్రెత్తుకొచ్చి, కోపం తట్టుకోలేక నడిరోడ్డు మీద అతన్ని దూషించాడు.

ఈ సంఘటన మొత్తం మొబైల్‌లో రికార్డ్ అయింది. ఈ వీడియో క్లిప్ చూసిన తరువాత, బక్సార్ ఎస్పీ ఆ పోలీసుపై చర్యలు తీసుకున్నారు. నిబంధనలను ఉల్లఘించడమే కాకుండా ఓ వ్యక్తిని అనవసరంగా దూషించినందుకు అతన్ని విధుల నుంచి  సస్పెండ్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#WorldSuicidePreventionDay ప్రతి 40 సెకన్లకు ఒకరు సూసైడ్ అటెంప్ట్