Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాకు ఓ ఎంపీ.. ఆయన ఇద్దరు కుమారులు మృతి!

Webdunia
శుక్రవారం, 21 మే 2021 (08:42 IST)
అనేక కుటుంబాల్లో కరోనా వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఏకంగా కుటుంబంలోని సభ్యులందరినీ మింగేస్తూ తీవ్ర విషాదాన్ని మిగుల్చుతోంది. ఈ క్రమంలో తాజాగా ఒడిశాకు చెందిన రాజ్యసభ సభ్యుడు రఘునాథ్ మహాపాత్ర (78) కూడా కరోనాతో ప్రాణాలు విడిచారు. 
 
ఇక్కడ మరింత విషాదం ఏమిటంటే ఆయన ఇద్దరు కుమారులు కూడా కొన్నిరోజుల వ్యవధిలోనే కన్నుమూశారు. మహాపాత్ర ఈ నెల 9న మరణించారు. గత నెల 22న ఒడిశాలోని భువనేశ్వర్‌లోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆయన మరిక కోలుకోలేకపోయారు.
 
ఆ తర్వాత మహాపాత్ర కుమారులు జశోబంత, ప్రశాంత కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. వీరిద్దరినీ ఎయిమ్స్‌‌కు తరలించినా ప్రయోజనం లేకపోయింది. ప్రశాంత గురువారం కన్నుమూయగా, పెద్దవాడైన జశోబంత శుక్రవారం తుదిశ్వాస విడిచాడు.
 
రఘునాథ్ మహాపాత్ర గొప్ప శిల్పిగా ఖ్యాతి పొందారు. ఆయనకు కేంద్రం పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఇచ్చి గౌరవించింది. ఇక, ఆయన కుమారుడు ప్రశాంత ఒడిశా రంజీ క్రికెట్ టీమ్ కెప్టెన్‌గా వ్యవహరించారు. కొన్నిరోజుల వ్యవధిలోనే ఆయన, ఇద్దరు కుమారుల మరణంతో ఒడిశా రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments