Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రఘురామక్రిష్ణమరాజు పనైపోయిందా? ఏడేళ్ళు ఊచలేనా..?

Advertiesment
రఘురామక్రిష్ణమరాజు పనైపోయిందా? ఏడేళ్ళు ఊచలేనా..?
, గురువారం, 20 మే 2021 (22:32 IST)
రఘురామక్రిష్ణమరాజు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మొదట్లో ఆయన్ను సిఐడీ అధికారులు రాజద్రోహం కేసులో అరెస్ట్ చేశారు. ఆ తరువాత జరిగిన నాటకీయ పరిణామాలన్నీ తెలిసిందే. తనను కట్టేసి కాళ్లపై సిఐడీ అధికారులు కొట్టారంటూ సిఐడీ కోర్టులో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు రఘురామ.
 
దీనిపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. రఘురామక్రిష్ణమరాజుకు సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స చేయాలని ఆదేశించారు. అంతేకాదు వైద్యపరీక్షలు చేసి ఆ రిపోర్ట్ ను సీల్డ్ కవర్‌లో అందించాలంది. అయితే రఘురామక్రిష్ణుమరాజు చెప్పిందంతా అబద్ధాలంటే అంటూ ప్రభుత్వం తరపున న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.
 
ఏదీ నిజం కాదని.. రఘురామక్రిష్ణుమరాజు రోజుకో అబద్ధాన్ని మాట్లాడుతున్నారంటూ ఫిటిషన్లో దాఖలు చేశారట. ఇక సుప్రీంకోర్టుకు ఇచ్చిన వైద్య పరీక్షలకు సంబంధించిన వివరాల్లో కూడా ఇదే స్పష్టంగా ఉన్నాయట. దీంతో రఘురామక్రిష్ణమరాజుకు చెప్పిన అబద్ధాలకు ఖచ్చితంగా ఏడేళ్ళ జైలు గ్యారంటీ అన్న వాదన వినబడుతోంది.
 
ఏడేళ్ళ జైలు అంటే రాజద్రోహంతో కలిపి ఏడేళ్ళ జైలు ఖాయమట. సుప్రీంకోర్టులో వైద్య పరీక్షలకు సంబంధించి రిపోర్ట్ అందగానే తదుపరి తీర్పు ఇలాగే ఉండక మానదంటున్నారు. సుప్రీంకోర్టులో అబద్ధాలు చెప్పినందుకు రఘురామక్రిష్ణమరాజుకు అక్షింతలు వేయడంతో పాటు సిఐడీ కోర్టులో రాజద్రోహంపై శిక్షను ఖరారు చేసే అవకాశాలే ఉన్నాయట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిత్తూరు జిల్లాను వణికిస్తున్న బ్లాక్ ఫంగస్, బోయకొండ ఆలయ ప్రధాన అర్చకుడికి...