నటుడిగా చిన్న ఇమేజ్ ఉన్న వాడైనా ఎదుటవారి కష్టాన్ని తీర్చడంలో మాత్రం జీవన్ పెద్ద మనసును చూపించాడు. కరోనా కష్టకాలంలో రోజూ 300కి పైగా కరోనా రోగులకు ఆకలితీరుస్తున్నారు జీవన్ కుమార్. సీనియర్ నటి పావలా శ్యామలా పరిస్థతి తెలిసి చలించిన జీవన్ కుమార్ వారికి సహాయం గా నిలిచాడు. పావలాశ్యామలా ఇంటికి వెళ్ళి ఆమె పడుతున్న కష్టాలను అర్ధం చేసుకొని కొన్ని అవసరమైన నిత్యావసరాలు తో పాటు పదివేల రూపాయలు అందించాడు.
ఇంటిలో రోజు వారీ పనులు చేసుకునే పరిస్థితిలో లేరని గమనించి వారింటికి రోజూ భోజనం పంపుతానని , ఏ సహాయం కావాలన్ని ముందుంటాని హామీ ఇచ్చారు. జీవన్ ఎవరో తెలియకపోయినా తన పరిస్థతికి స్పందించి సాయం చేసేందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు పావలా శ్యామల
సీనియర్ జర్నలిస్ట్, నటడు టి ఎన్ ఆర్ కుటుంబానికి కూడా సహాయంగా నిలిచాడు జీవన్ కుమార్. టి ఆన్ ఆర్ ఆకస్మిక మరణం వారి కుటుంబ జీవనచిత్రాన్ని మార్చివేసింది. ఆయన కుటుంబానికి ఆయన లేని లోటు తీరనది. జర్నలిస్ట్ గానే కాకుండా , నటుడిగా కూడా రాణిస్తున్న టి ఎన్ ఆర్ మరణ వార్త అందరినీ కలిచివేసింది. ఆయన కుటుంబానికి అండగా నలిబడేందుకు జీవన్ కుమార్ ముందుకు వచ్చాడు. టిఎన్ ఆర్ సతీమణి జ్యోతి గారిని పరామర్శించి 50 వేల రూపాయులు తన వంతు సహాయం అందించాడు.
ఈ సందర్భంగా జీవన్ కుమార్ మాట్లాడుతూ, పావలా శ్యామలా గారి పరిస్థతి చూసి చాలా బాధ వేసింది. అంత సీనియర్ నటి ఇలాంటి పరిస్థితిలో ఉండటం చాలా విచారకరం.అందుకే నావంతుగా సహాయం చేసాను. ఆమెకు ఎలాంటి సహాయం కావాలన్నా ముందు నిలబడేందుకు సిద్దం గా ఉంటాను. టి ఎన్ ఆర్ గారు నాకు జర్నలిస్ట్ గా బాగా ఇష్టమైన వ్యక్తి ఆయన మరణం నన్ను కలిచివేసింది. వారి సతీమణి జ్యోతి గారితో మాట్లాడుతుంటే నేను తట్టులేకపోయాను. వారి కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటాను . అన్నారు..