Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిన్న న‌టుడు పెద్ద సాయం చేస్తున్న జీవ‌న్ కుమార్

చిన్న న‌టుడు పెద్ద సాయం చేస్తున్న జీవ‌న్ కుమార్
, శుక్రవారం, 14 మే 2021 (15:42 IST)
Jeevan kumar- rice bags
క‌రొనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో న‌టుడు జీవ‌న్ కుమార్ చేస్తున్న సాయం చాలా మందికి అండ‌గా నిలుస్తుంది. గ‌తేడాది క‌రోనా క‌ష్ట‌కాలంలో నిత్యావ‌స‌ర వస్తువులు, కూర‌గాయల‌, భోజ‌నం పంపిణీ చేసిన జీవ‌న్ కుమార్ అండ్ టీం సేవ‌లు ఇప్పుడుకూడా నిరంత‌రాయంగా కొన‌సాగుతున్నాయి. నిరుపేద‌లు, క‌రోనా బారిన ప‌డి ఎవ‌రి అండా లేని వారికి జీవ‌న్ కుమార్ అండ్ టీం మేమున్నాం అనే భ‌రోసా నిస్తుంది.  మూడు వంద‌ల క‌రోనా పేషెంట్స్ రోజూ క‌డుపు నింపుతున్నాడు జీవ‌న్. ఎలాంటి స‌హాయం అయినా త‌న శ‌క్తికి మించి సాయం అందిస్తున్న ఇత‌ని పెద్ద మ‌న‌సును అంద‌రూ కొనియాడుతున్నారు. 
 
న‌టుడిగా `ఈ న‌గ‌రానికి ఏమైంది` నుండి మొద‌లైన ప్ర‌యాణం స‌క్సెస్ పుల్ గా సాగుతుంది. రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్ `జాతిర‌త్నాలలు`లో అత‌ని పాత్ర  మంచి గుర్తింపు తెచ్చింది. స్వ‌త‌హాగా  రెస్టారెంట్ బిజినెస్ లో అనుభ‌వం క‌ల జీవ‌న్ కుమార్ గ‌త సంవ‌త్స‌రం త‌న రెస్టారెంట్ నుండే క‌రోనా స‌హాయ కార్య‌క్ర‌మాల‌ను కొన‌సాగించాడు. మ‌న‌వ‌తావాదిగా జీవ‌న్ కుమార్ అందించిన సేవ‌ల‌ను సైబ‌ర్ బాద్ క‌మీష‌న‌ర్ స‌జ్జ‌నార్ కొనియాడారు. ఇప్పుడు కూడా జీవ‌న్ త‌న దాతృత్వాన్ని వ‌ద‌ల‌లేదు. 
 
webdunia
jeevan, oxygen, Commodities
త‌న టీంతో బ‌ద్రాద్రి కొత్త‌గూడం లో ని ట్రైబ‌ల్ ఎరియాల‌కు 10వేల కేజీల రైస్ ని  పంపిణీ చేసాడు. ఆక్సిజ‌న్ కొర‌త ఇప్ప‌డు ఎంత పెద్ద స‌మ‌స్యో అంద‌రికీ తెలిసిందే ఈ టైం ఆక్సిజ‌ర్ రీఫిలింగ్ సెంట‌ర్ ల‌ను 200 సిలెండ‌ర్స్ ని అత్య‌వ‌స‌ర కేసుల‌కు అందించ‌గ‌లిగాడు. మాస్క్ లు శానిటైజ‌ర్స్ అందుబాటులో లేని పేద‌ల‌కు వాటిని ఇంటి ఇంటికి తిరిగి పంపిణీ చేసి వాటిపై అవ‌గాహాన క‌ల్పించాడు.  రోజూ మూడు వంద‌ల కు పైగా క‌రోనా పేషెంట్స్ కి షౌషికాహారం అందిస్తున్నాడు జీవ‌న్ కుమార్. క‌రోనా సెంకండ్ వేవ్ మొద‌లైన ద‌గ్గ‌ర నుండి జీవ‌న్ కుమార్ త‌న టీంతో క‌రోనా పేషెంట్స్ కి పౌష‌కాహారం అందిస్తు్న్నాడు. రోజుకు మూడు వంద‌ల కి ఆక‌లి తీర్చుతున్నాడు. అత‌ని సేవ‌ల‌కు సినిమా ఇండ‌స్ట్రీలో చాలా మంది ప్ర‌ముఖులు ప్ర‌శంస‌లు తెలుపుతున్నారు. జీవ‌న్ త‌న కున్న సేవా గుణంతో చేస్తున్న సేవ‌ల‌కు చాలా మంది  అండ‌గా నిలుస్తున్నారు. జీవ‌న్ న‌టుడిగా త‌న‌దైన ప్ర‌యాణం చేస్తూనే నిజ జీవితంలో హీరో గా నిలిచాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మ‌త సామ‌ర‌స్యం పాటిస్తూ శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ముఖులు